Oscar 2026: అట్టహాసంగా మొదలైన ఆస్కార్ అవార్డుల వేడుక.. విజేతలు వీళ్ళే
98వ ఆస్కార్(Oscar 2026) అవార్డుల ప్రధానోత్సవ వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా మొదలయ్యింది.
- V Santhosh Kumar
- Published On : March 16, 2026 / 08:00 AM IST
98th Oscars ceremony has begun grandly.
Oscar 2026: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 98వ ఆస్కార్ వేడుకలు మార్చి 16న అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది అకాడమీ(Oscar 2026) అవార్డుల చరిత్రలో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. గతంలో 23 విభాగాల్లో అవార్డులు ఇచ్చేవారు, కానీ ఈసారి కొత్తగా ‘బెస్ట్ కాస్టింగ్’ విభాగాన్ని చేర్చడంతో మొత్తం 24 కేటగిరీల్లో పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ వేడుకలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగంలో ‘సెంటిమెంటల్ వాల్యూ’ విజేతగా ఆమె ప్రకటించారు. అలాగే, ‘ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం’ కేటగిరీలో రెండు చిత్రాలకు అవార్డులు దక్కడం విశేషం. 2025లో విడుదలైన అత్యుత్తమ చిత్రాలకు ఈ గౌరవం లభించింది.
విజేతల వివరాలు ఇలా ఉన్నాయి:
ఉత్తమ నటుడు: మైఖెల్ బి. జోర్డాన్ (సిన్నర్స్)
ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ సాంగ్ (కె-పాప్ డిమాన్ హంటర్స్)
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్ వాల్యూ (నార్వే దేశపు సినిమా)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్ డురాల్డ్ అర్కపా (సిన్నర్స్)
ఉత్తమ ఎడిటింగ్: యాండీ జుర్గెన్‌సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ (సిన్నర్స్)
ఉత్తమ సౌండ్: గరేత్ జాన్, ఏఐ నెల్సన్, గ్వెన్‌డాలిన్ యేట్స్ విర్టల్, గేరీ ఎ.రిజో, జాన్ పెరల్ట (ఎఫ్ 1)
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: మిస్టర్ నోబడీ ఎగైన్‌స్ట్ పుతిన్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ఆల్ ద ఎంప్టీ రూమ్స్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: జో లెటరి, రిచర్డ్ బనెహం, ఎరిక్ సైండన్, డేనియల్ బారెట్ (అవతార్: ఫైర్ అండ్ యాష్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తమర డేవెరల్, షేన్ వ్యూ (ఫ్రాంకెన్‌స్టీన్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: పాల్ థామస్ అండర్సన్ (వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటి : అమీ మాడిగన్ (వెపన్స్)
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మైక్ హిల్, జోర్డాన్ సామ్యూల్, క్లియోనా ఫ్యూరే (ఫ్రాంకెన్‌స్టీన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: కేట్ హాలే (ఫ్రాంకెన్‌స్టీన్)
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ద గర్ల్ హు క్రైడ్ పర్ల్స్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: కె-పాప్ డిమాన్ హంటర్స్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ద సింగర్స్, టూ పీపుల్ ఎక్స్‌చేంజింగ్ సలైవా
