Jithender Reddy : ‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి యూత్ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్..

రాకేష్ వర్రే హీరోగా నటిస్తున్న 'జితేందర్ రెడ్డి' మూవీ నుంచి యూత్ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు.

A aa E ee U uu Lyrical song released from Jithender Reddy movie

Jithender Reddy : రాకేష్ వర్రే హీరోగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ ‘జితేందర్ రెడ్డి’. విరించి వర్మ ఈ సినిమాని డైరక్ట్ చేస్తున్నారు. 1980 సమయంలో జగిత్యాలలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని చిత్రీకరించారు. థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్దమైన ఈ మూవీ.. ప్రమోషన్స్ ని మేకర్స్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఈక్రమంలోనే మూవీ నుంచి ఓ యూత్ ఫుల్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు.

‘అ ఆ ఇ ఈ ఉ ఊ’ అంటూ సాగే ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించారు. రాంబాబు గోసాల లిరిక్స్ రాయగా రాహుల్ సిప్లిగంజ్ పాటని పాడారు. కాలేజీలో జరిగే ఎలక్షన్స్ గ్యాంగ్స్ మధ్య ఉండే రైవలరీస్ తో ఈ లిరికల్ సాంగ్ ని చూపించారు. పాట కాలేజీ స్టూడెంట్స్ ని ఆకట్టుకునేలా ఉంది. మరి ఆ పాటని మీరు కూడా వినేయండి.

Also read : Ram Charan : తండ్రిగా ఎంతో గర్వంగా ఉంది.. పుత్రోత్సాత్వంతో చిరంజీవి ట్వీట్..

కాగా ఈ సినిమాని మే 3న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్ గా నటించగా.. ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ముఖ్య పాత్రలు చేసారు.

ట్రెండింగ్ వార్తలు