3 Idoits Sequal: ‘3 ఇడియట్స్ సీక్వెల్’.. పార్ట్ 2లో మారేది ఇదే.. ఆమీర్ ఖాన్ ఆసక్తికర ప్రకటన
బ్లాక్ బస్టర్ 3 ఇడియట్స్ సినిమా సీక్వెల్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆమిర్ ఖాన్(Aamir Khan).
- V Santhosh Kumar
- Updated on- April 28, 2026 / 04:54 PM IST
aamir khan interesting comments on 3 Idiots sequel.
- 3 ఇడియట్స్ సీక్వెల్ సిద్ధం.
- రంచోగా మళ్లీ ఆమీర్ ఖాన్.
- రాజ్‌కుమార్ హిరానీ అద్భుత స్క్రిప్ట్.
Aamir Khan: భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘3 ఇడియట్స్’. ఆమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే, ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోందని ఆమీర్ ఖాన్(Aamir Khan) స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ప్రస్తుతం 3 ఇడియట్స్ పార్ట్-2 స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, మొదటి భాగం ముగిసిన పదేళ్ల తర్వాత ఉండే పరిణామాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ఆయన వెల్లడించారు.
Ashu Reddy: రూ.9 కోట్ల మోసం.. హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి.. తనపై కేసును కొట్టేయాలని పిటిషన్!
అభిజిత్ జోషితో కలిసి హిరానీ సిద్ధం చేసిన ఈ కథలో హాస్యం, భావోద్వేగాలు పుష్కలంగా ఉన్నాయని, మరోసారి ‘రంచో’ పాత్రలో నటించేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమీర్ తెలిపారు. 2009లో విడుదలైన ‘3 ఇడియట్స్’ విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ రూ. 200 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. చాలా కాలంగా ఈ సినిమా రెండో భాగంపై వస్తున్న వార్తలకు ఆమీర్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హిరానీతో చేయాల్సిన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ బయోపిక్ ప్రస్తుతం స్క్రిప్ట్ కారణాల వల్ల ఆగిపోయిందని సమాచారం.
మరోవైపు, భారత్‌పే కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ బయోపిక్‌లో కూడా ఆమీర్ ఖాన్ నటించే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆమీర్ తన కుమారుడు జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ ‘ఏక్ దిన్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లోనే ఆయన ‘3 ఇడియట్స్ 2’ గురించి అప్‌డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. సీక్వెల్‌లో ఆర్. మాధవన్, శర్మన్ జోషి వంటి పాత తారాగణం మళ్లీ కనిపిస్తారా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
