Dear Astronaut : ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్.. శేఖర్ కమ్ముల చేతుల మీదుగా..
Dear Astronaut : సౌమిత్, శ్రేయసి సేన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘డియర్ ఆస్ట్రోనాట్’.
- Thota Vamshi Kumar
- Updated on- October 30, 2026 / 11:52 AM IST
Aare Aare Video Song from Dear Astronaut
Dear Astronaut : సౌమిత్, శ్రేయసి సేన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘డియర్ ఆస్ట్రోనాట్’. యువన్కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజ సమర్పణలో కార్తీక్ భాగ్యరాజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. డియర్ ఆస్ట్రోనాట్ సినిమా నవంబర్ 20న రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా నుంచి ఆరే ఆరే.. రారో.. అనే మెలోడీ సాంగ్ ని విడుదల చేసారు.
సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజ్ చేసారు. కార్తీక్ సంగీహ దర్శకత్వంలో వీరు గడ్డం ఈ పాటను రాయగా వైభవ్ గరిమెళ్ళ, కార్తీక్ పాడారు. మీరు కూడా ఈ సాంగ్ ని వినేయండి..
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ఆస్ట్రోనాట్ అవ్వాలనే కోరిక ఉండటం, ఆ కోరిక చుట్టూ కథను తీయడం బాగుంది. ఈ అమ్మాయి కూడా చక్కగా నటించింది. ఇది చాలా మంచి ప్రయోగం. ఎవరైనా సరే ఎంత పెద్ద కలలైనా కనొచ్చు, వాటిని సాకారం చేసుకోవచ్చు అనే సందేశాన్ని ఇచ్చేలా సినిమాని రూపొందించారు. టెక్నికల్లీ ఈ సినిమా చాలా క్వాలిటీగా ఉందనిపిస్తోంది అని అన్నారు. కమల్ కామరాజ్ మాట్లాడుతూ.. డియర్ ఆస్ట్రోనాట్ లాంటి కథని తెర మీదకు తీసుకు రావడమే గొప్ప సాహసం. ఓ అమ్మాయి భావోద్వేగాలను చూపించే సినిమా. కలలు కంటే సాకారం అవుతాయా? లేదా? మనకు తెలీదు. కానీ పెద్ద కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలని చెప్పే సందేశంతో ఈ మూవీని తీశారు అని అన్నారు.
నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల గారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. భాగ్యరాజా నన్ను నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయి అని తెలిపారు. హీరోయిన్ శ్రేయసి సేన్ మాట్లాడుతూ.. డియర్ ఆస్ట్రోనాట్ సినిమాలో అందమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. అందరినీ ఇన్ స్పైర్ చేసేలా మూవీ ఉంటుంది అని అన్నారు. హీరో సౌమిత్ మాట్లాడుతూ.. డియర్ ఆస్ట్రోనాట్ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అందరికీ కనెక్ట్ అవుతుంది అని తెలిపారు. నటి గీతా భాస్కర్ మాట్లాడుతూ.. డియర్ ఆస్ట్రోనాట్ అందరినీ ఆలోచింపజేస్తుంది. ఇంత గొప్ప సినిమాని తీసినందుకు కార్తీక్కి థాంక్స్. శేఖర్ కమ్ముల గారి వల్లే నాకు ఐడెంటిటీ వచ్చింది అని అన్నారు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల, ఇంద్రగంటి గారి స్టైల్లో ఈ సినిమా ఉంటుంది. నాకు నచ్చి ఈ సినిమా చేశాను అని తెలిపారు.
