×
Ad

Seetha Payanam : ప్రేమికుల రోజు ‘సీతా పయనం’.. యాక్షన్ కింగ్ దర్శకుడిగా కూతురు హీరోయిన్ గా..

సీతా పయనం సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు. (Seetha Payanam)

  • Published On : February 7, 2026 / 12:50 PM IST

Seetha Payanam

Seetha Payanam : యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడిగా మారి తన కూతురు ఐశ్వర్య అర్జున్ ని హీరోయిన్ గా పెట్టి సీతా పయనం అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ.. పలువురు కీలక పాత్రలు పోషిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్, అతని మేనల్లుడు ధ్రువ సర్జా స్పెషల్ రోల్స్ చేస్తున్నారు.(Seetha Payanam)

సీతా పయనం సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసారు. ఓ పక్క ప్రమోషన్స్ చేస్తున్నారు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. సీతా పయనం సినిమా తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా.

Also Read : Riya Shibu : తెలుగు కుర్రాళ్లను ‘సర్వం మాయ’ చేసిన డెలులు క్యూట్ దయ్యం.. మలయాళీ భామ రియా శిబు ఫొటోలు..

తండ్రి దర్శకుడిగా కూతురు హీరోయిన్ గా మంచి అంచనాల రాబోతున్న ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా సీతా పయనం వాలెంటైన్స్ డే రోజు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.