×
Ad

Arjun : ఇలాంటి రాజకీయ నాయకుడు ఉండటం గొప్ప విషయం.. పవన్ పై అర్జున్ కామెంట్స్ వైరల్..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అర్జున్ నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలు తెలిపారు.(Arjun)

Arjun

Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కిన సినిమా ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాతో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అర్జున్ నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలు తెలిపారు.(Arjun)

సీతా పయనం సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. ఏ భాషలో చేసినా, తీసినా, చూసినా అందరికీ రిలేట్ అవుతుంది. ఇదొక ఫీల్ గుడ్ సబ్జెక్ట్. అన్ని భాషల్లో వర్కౌట్ అవుతుంది. అందుకే నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నాను. జెన్ జీ నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ చూడొచ్చు ఈ సినిమాని. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌కు వచ్చి చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో కేవలం ప్రేమ మాత్రమే కాదు చాలా ఎమోషన్స్, అంశాలున్నాయి. 13 ఏళ్ల క్రితం ఈ సబ్జెక్ట‌కి సంబందించిన ఐడియా వచ్చింది. అప్పటి నుంచి అలా నా మెదడులో మెదులుతూనే ఉంది. నా కూతురికి అప్పుడే ఈ పాయింట్‌ను చెప్పాను. ఇలాంటి మంచి కథతోనే నా కూతురిని పరిచయం చేయాలనుకున్నాను అని తెలిపారు.

Also Read : Lavanya Tripathi : ప్రగ్నెన్సీతో లావణ్య చేసిన సినిమా.. బాబు పుట్టిన తర్వాత రిలీజ్..

తన కూతురిని తెలుగులోనే పరిచయం చేయడంపై స్పందిస్తూ.. నాకు సినిమా పరిశ్రమ ఎంతో ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. అందుకే ఐశ్వర్యని ఇక్కడి నుంచే లాంచ్ చేయాలని అనుకున్నాను అని తెలిపారు.

Arjun

ఈ సినిమా మొదట విశ్వక్ సేన్ తో మొదలయింది కానీ తర్వాత విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీనిపై అర్జున్ స్పందిస్తూ.. ముందు నేను కథ రెడీ చేసుకున్నాను. తరువాత విశ్వక్ సేన్ అనుకున్నాం. అన్ని మనం అనుకున్నట్టుగా జరగవు. కథలో ఒక్క సీన్ కూడా మార్చలేదు. విశ్వక్ ప్లేస్ కి నిరంజన్ వచ్చాడు. విశ్వక్ సేన్‌తో సమస్యలేమీ లేవు. అన్నీ పరిష్కరించుకున్నాం. జీవితం ఒక సర్కిల్ లాంటిది. ఇక్కడ కక్ష్య సాధింపులు ఏమీ ఉండవు. మళ్లీ సెట్ అయితే కలిసి సినిమా చేస్తాం అని అన్నారు.

Also Read : Nani: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబో.. మిస్సైన డైరెక్టర్ తో నాని సినిమా

అర్జున్ మాట్లాడుతూ.. హనుమాన్ జంక్షన్ సీక్వెల్ చేయాలని ఉంది. నిన్ననే జగపతి బాబుతో కూడా మాట్లాడాను. అతను కూడా అదే అన్నాడు. కానీ మంచి కథ సెట్ అవ్వాలి. ఎవరైనా మంచి కథతో వస్తే నేనే నిర్మిస్తాను, దర్శకత్వం వహిస్తాను అని అన్నారు. అలాగే నా జెంటిల్‌మెన్ సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేయాలని ఉంది. ఇప్పటికీ అప్పటికీ ఏమీ మారలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు కూడా జెంటిల్‌మెన్ సినిమా సరిపోతుంది. అందుకే ఆ సినిమాను రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను అని అన్నారు.

ఈ సినిమా ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గురించి అర్జున్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ని ఐదారు సార్లు మాత్రమే కలిశాను. ఈ సినిమా పూజకు రావాలని అడిగినప్పుడు వెంటనే ఒప్పుకున్నారు. ఐదు నిమిషాలు అని వెళ్తే మూడు గంటలు ఆయనతో మాట్లాడాను. ఆయన ఎంతో నిజాయితీ గల వ్యక్తి. ఇలాంటి రాజకీయ నాయకుడు ఉండటం గొప్ప విషయం. ఖుషి నుంచి మా ఇంట్లో అందరికీ ఆయనంటే ఇష్టం అని తెలిపారు.