×
Ad

Ajay Devgn : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..

అజయ్ దేవ్‌గణ్ నటించిన ఫస్ట్ సినిమా Phool Aur Kaante 1991 నవంబర్ 22న విడుదలైంది..

  • Published On : November 22, 2021 / 02:00 PM IST

Ajay Devgn

Ajay Devgn: అజయ్ దేవ్‌గణ్.. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో, డిఫరెంట్ క్యారెక్టర్లతో ప్రేక్షకాభిమానులను అలరించారు. నేటితో నటుడిగా మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నారు అజయ్. ఆయన నటించిన ఫస్ట్ సినిమా Phool Aur Kaante 1991 నవంబర్ 22న విడుదలైంది.

ఈ చిత్రం రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు అవుతోంది. ఈ సినిమాకి గాను బెస్ట్ మేల్ డెబ్యూట్ కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారు అజయ్. అక్కడినుండి సినిమా సినిమాకి నటుడిగా తనను సాన బెట్టుకుంటూ.. మంచి కథలు, క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ సపరేట్ స్టార్‌డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ బర్త్‌డే సర్‌ప్రైజ్.. అజయ్ దేవగన్ వీడియో!

యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గానే కాకుండా, టెలివిజన్ రంగంలోనూ తన సత్తా చాటారు. మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా చేశారు. హిందీలో ‘ఈగ’, ‘ధృవ’ సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు. ఇటీవల ‘సూర్యవంశీ’ లో గెస్ట్ రోల్‌లో అదరగొట్టేశారు. ఫుట్ బాల్ కోచ్‌గా నటించిన ‘మైదాన్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది.

ప్రస్తుతం ‘థ్యాంక్ గాడ్’, ‘దృశ్యం 2’, ‘మేడే’ సినిమాల్లో హీరోగా నటిస్తున్న అజయ్ దేవ్‌గణ్ ‘ఆర్ఆర్ఆర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ నిడివి తక్కువే అయినా కథలో కీలకమైన రోల్ చేస్తున్నారు. అలాగే అలియా భట్ – సంజయ్ లీలా భన్సాలీ కాంబోలో వస్తున్న ‘గంగూబాయి కథియావాడి’ లో కీ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.

Radhe Shyam : రెబల్ స్టార్ రేంజ్.. నార్త్‌లో బిగ్గెస్ట్ రిలీజ్..