Randeep Hooda : లేటు వయసులో.. ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్న బాలీవుడ్ హీరో..
Randeep Hooda-Lin Laishram : బాలీవుడ్ సీనియర్ హీరో రణ్‌దీప్ హుడా త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : November 25, 2023 / 08:45 PM IST
Randeep Hooda-Lin Laishram
Randeep Hooda-Lin Laishram : బాలీవుడ్ సీనియర్ హీరో రణ్‌దీప్ హుడా త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. 47 ఏళ్ల వయసులో ఈ నటుడు పెళ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నెల 29న రణ్‌దీప్, లిన్ లైస్ట్రామ్‌ల వివాహం జరగనుంది.
మహాభారతంలో అర్జునుడు ఎక్కడైతే మణిపూర్ యువరాణి చిత్రాంగదను పెళ్లి చేసుకున్నాడో అక్కడే మా వివాహం జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ నెల 29న ఇంఫాల్‌లో మా వివాహం జరగనుంది. త్వరలోనే ముంబైలో రిసెప్షన్ ఉంటుంది. మా ప్రయాణానికి మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం అని రణ్‌దీప్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
Bigg Boss 7 : కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్న నాగార్జున.. వాటి మూలంగానే మనం బలైపోతాం
గత కొన్నాళ్లుగా రణదీప్, లిన్ లు డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరి డేటింగ్‌పై ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరు తమ రిలేషన్ ఎక్కడా బయట పెట్టలేదు. 2022లో దీపావళి వేడుకల తరువాత ఈ జంట తమ బంధాన్ని బయటకు వెల్లడించింది. రణ్‌దీప్ వయస్సు 47 ఏళ్ల కాగా లిన్ ఆయన కంటే 10 ఏళ్లు చిన్నది.
Jabardasth Faima : ఆస్పత్రిలో జబర్ధస్త్ ఫైమా.. చేతికి సెలైన్.. కంగారు పడుతున్న అభిమానులు..!
2001లో విడుదలైన మాన్‌సూన్ వెడ్డింగ్ సినిమా రణ్‌దీప్ హుడా బాలీవుడ్‌తోకి ఎంట్రీ ఇచ్చారు. సాహెబ్, రిస్క్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్‌టెయిల్, కిక్ , భాగి 2, రసియా, హైవే , సర్బ్‌జిత్ చిత్రాల్లో ఆయన నటించారు. కాగా.. ప్రస్తుతం ఆయన వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా స్వతంత్ర వీర్ సావర్కర్ మూవీని స్వయంగా తెరకెక్కిస్తున్నారు. లిన్ చివరిసారిగా జానే జాన్ చిత్రంలో కనిపించారు.
