Sai Dharam Tej : పవన్ మామయ్య అంటే ప్రాణం.. ఇది దేవుడు ఇచ్చిన పునర్జన్మ.. కడప పెద్ద దర్గాలో సాయిధరమ్ తేజ్ ప్రత్యేక ప్రార్థనలు
ఇది తనకు దేవుడు ఇచ్చిన పునర్జన్మ అంటూ హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు. కడపలోని పెద్దా దర్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
- Thota Vamshi Kumar
- Published On : July 14, 2023 / 08:51 PM IST
Pawan Kalyan-Sai Dharam Tej
Actor Sai Dharam : ఇది తనకు దేవుడు ఇచ్చిన పునర్జన్మ అంటూ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)అన్నారు. కడపలోని పెద్ద దర్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కడపకు వస్తే పెద్ద దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ అని అన్నారు. ఇది తనకు పునర్జన్మ అని, దేవుడు పునర్జన్మ ప్రసాదించాడని చెప్పుకొచ్చారు.
మామయ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే తనకు ప్రాణం అని సాయి ధరమ్ తేజ్ చెప్పారు. ఆయనతో కలిసి నటించడం జీవితంలో మరచిపోలేని అనుభూతని, ఇది ఓ అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాజకీయాలపై అవగాహన ఉంటేనే రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ మామయ్య చెప్పారని, అయితే.. తాను సినీ రంగంలోనే ఉంటానని, అటు వైపు వెళ్లే ఆలోచన లేనట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు.
2021 సెప్టెంబర్ 10న దుర్గం చెరువు వద్ద బైకు మీద ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. తీవ్ర గాయాలు కాడంతో చాలా రోజుల పాటు ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నాడు తేజ్. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున పూజాలు చేశారు. డాక్టర్ల కృషి, ఫ్యాన్స్ పూజలు, దేవుడి కటాక్షంతో ఆయన కొద్ది రోజుల తరువాత క్షేమంగా ఇంటికి వచ్చారు. మాటలు మాట్లాడేందుకు సైతం కొద్ది రోజులు ఆయన ఇబ్బంది పడ్డారు. ఆ ప్రమాదాన్ని ఉద్దేశించి సాయిధరమ్ తేజ్ ఇది తనకు పునర్జన్మ అంటూ వ్యాఖ్యానించాడు.
Janhvi Kapoor : అమ్మ చనిపోయినప్పుడు.. పెద్ద యుద్ధమే చేశా : జాన్వీకపూర్
ఇక సినిమాల విషయానికి వస్తే.. మేనమామ పవన్ కళ్యాణ్‌తో కలిసి సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ (BRO)సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వినోదయ సితం’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్ర ఖనినే ఈ సినిమాకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్నాడు. జూలై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
