×
Ad

Actor Sivakarthikeyan Car Accdient: ప్రముఖ హీరో కారుకు ప్రమాదం.. ఎలా జరిగిందంటే..

వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

Actor Sivakarthikeyan Car Accdient: హీరో శివ కార్తికేయన్ కారు ప్రమాదానికి గురైంది. చెన్నైలోని మధ్య కైలాశ్ ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. హెవీ ట్రాఫిక్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కాసేపటి తర్వాత శివ కార్తికేయన్ తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. శివకార్తికేయన్ కారు స్వల్పంగా దెబ్బతింది. కాగా, రెండు కార్ల డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో శివ కార్తికేయన్ కూడా అక్కడ ఉన్నారు. అక్కడే ఉన్న ఇతర వాహనదారులు ఇదంతా తమ ఫోన్ లో రికార్డ్ చేశారు.

కాగా, రెమో సినిమాతో తెలుగువారికి దగ్గరైన శివ కార్తికేయన్.. ప్రస్తుతం పరాశక్తి సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్.

Also Read: మాస్‌ మహారాజా ట్యాగ్ తీసేయమన్న రవితేజ.. కారణం అదేనా?