Srinath Maganti: బూతులు తిట్టిన రణబీర్.. అరేయ్ అది అందరికోసం అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీనాథ్ మాగంటి
యానిమల్ మూవీ హీరో రణబీర్ కపూర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు శ్రీనాథ్ మాగంటి(Srinath Maganti).
- V Santhosh Kumar
- Published On : March 7, 2026 / 03:12 PM IST
Actor Srinath Maganti shocking comments about Ranbir Kapoor
Srinath Maganti: ఈమధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక నటుడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆ నటుడు మరెవరో కాదు శ్రీనాథ్ మాగంటి. ఈ నటుడు నటించిన చాలా చాలా సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. వాటిలో హిట్ సిరీస్, యానిమల్. లక్కీ భాస్కర్ లాంటి చాలా సినిమాలు ఉన్నాయి. అయితే, శ్రీనాథ్ మాగంటి హీరోగా చేసిన మూవీ ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు శ్రీనాథ్(Srinath Maganti).
Tollywood: సుకుమార్ శిష్యులా మజాకా.. కంటెంట్ తో కుమ్మేస్తున్నారు.. ముగ్గురూ ముగ్గురే
ఈ పాడ్ కాస్ట్ లో ఆయన మాట్లాడుతూ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. “రణబీర్ సింగ్ సెట్స్ లో చాలా సింపుల్ గా ఉంటారు. వచ్చేటప్పుడు పెద్ద ప్లేట్ నిండా చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్ తీసుకువచ్చే వారు. నేను, అదంతా తనే తింటాడేమో అనుకున్నాను. కానీ, సెట్స్ లో అందరికోసం ఆయన తీసుకువచ్చేవారు. ఒకరోజు నేను ఆ ప్లేట్ నుంచి ఎదో తీసుకోబోయాను.
ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి అది రణబీర్ ప్లేట్ అని చెప్పారు. దానికి, రణబీర్ వెంటనే కలుగజేసుకొని అతడిని బూతులు తిడుతూ అవి అందరికోసం అని చెప్పాడు. ఆయన ఆ బూతులు తిట్టడం కూడా ప్రేమతోనే కానీ, ఎదో తిట్టాలని కాదు” అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో, శ్రీనాథ్ రణబీర్ గురించి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక యానిమల్ సినిమా విషయానికి వస్తే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలకు సీక్వెల్ గా యానిమల్ పార్క్ అనే సినిమా కూడా రానుంది.
