Shamita Shetty : 50 ఏళ్లు వచ్చిన పెళ్లి కాలేదు? అన్న నెటిజన్ ప్రశ్నకి ఆ నటి ఇచ్చి పడేసిందిగా

కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ప్రశ్నలు అడుగుతుంటారు. చాలామంది సెలబ్రిటీలు వాటిని పట్టించుకోరు. కానీ షమితా శెట్టి ఊరుకోలేదు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఘాటు రిప్లై ఇచ్చారు.

Shamita Shetty : 50 ఏళ్లు వచ్చిన పెళ్లి కాలేదు? అన్న నెటిజన్ ప్రశ్నకి ఆ నటి ఇచ్చి పడేసిందిగా

Shamita Shetty

Shamita Shetty : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లెలు నటి షమితా శెట్టి అందరికీ తెలుసు. ‘మొహబ్బతే’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ నటి తర్వాత చాలానే సినిమాల్లోనే చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ నటి రీసెంట్‌గా ఓ నెటిజన్‌కు ఇచ్చిన ఘాటు రిప్లై వైరల్ అవుతోంది.

Emraan Hashmi : ఆ హీరోయిన్‌ను ప్లాస్టిక్‌తో పోల్చిన నటుడు

షమితా శెట్టి నటి మాత్రమే కాదు ఇంటీరియర్ డిజైనర్ కూడా. మొహబ్బతే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ నటి బేవషా, క్యాష్ వంటి హిట్ సినిమాల్లో నటించారు. 2021 లో బిగ్ బాస్  షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. మధ్యలో కాస్త గ్యాప్ తర్వాత  2022 లో ‘తేరే విచ్ రబ్ డిస్దా’ అనే మ్యూజిక్ వీడియోలో నటించారు. 2023 లో ‘ది టెనెంట్’ సినిమాతో 15 సంవత్సరాల తర్వాత స్క్రీన్‌పై కనిపించారు. కాగా రీసెంట్‌గా షమితను ఓ నెటిజన్ ‘నీ జీవితంలో 50 సంవత్సరాలు వచ్చినా ఒక్క మగాడు లేకుండా ఎలా గడిచిపోయిందంటూ’ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు చాలా ఇబ్బంది పడ్డ షమితా ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారు. తన ఇన్‌స్టా స్టోరీలో ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ పోస్టు పెట్టారు.

Gama Awards : త్వరలో దుబాయిలో ‘గామా’ అవార్డ్స్ వేడుక.. SP బాలసుబ్రహ్మణ్యం స్మృతిగా ‘గామా SPB గోల్డెన్ వాయిస్ అవార్డు’..

‘జీవితంలో కొంచెం అయినా పాజిటివ్‌గా ఆలోచించమని.. ఇలా ఇంకెప్పుడూ ఏ అమ్మాయిని ప్రశ్నించి తక్కువ చేసి మాట్లాడొద్దని..ఇతరులకు మంచి చేయలేకపోతే మౌనంగా అయినా ఉండమని’ షమితా శెట్టి ఆ నెటిజన్‌కి ఇచ్చి పడేసారు. షమితాకు ఇప్పుడు 45 సంవత్సరాలు. బిగ్ బాస్‌ షోలో ఉన్నప్పుడు హౌస్ మేట్ రాకేశ్‌ను ప్రేమించారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం షమితా పోస్టు వైరల్ అవుతోంది.

Shamita Shetty

Shamita Shetty