Emraan Hashmi : ఆ హీరోయిన్‌ను ప్లాస్టిక్‌తో పోల్చిన నటుడు

బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ అందాల నటి ఐశ్వర్యా రాయ్‌పై చేసిన కామెంట్ వల్ల విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారు?

Emraan Hashmi : ఆ హీరోయిన్‌ను ప్లాస్టిక్‌తో పోల్చిన నటుడు

Emraan Hashmi

Emraan Hashmi : బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ గతంలో ఐశ్వర్యా రాయ్‌పై చేసిన కామెంట్‌తో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఆ విషయాన్ని ఇటీవల గుర్తు చేసుకున్నారు. ఇంతకీ ఇమ్రాన్ హష్మీ ఐశ్వర్యను ఏమన్నారు?

Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్‌కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ఆ సినిమాకి సీక్వెల్..

‘రాజ్’ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి ‘ఫుట్ పాత్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ హష్మీ గ్యాంగ్ స్టర్, మర్డర్ 2, ది డర్టీ పిక్చర్, జన్నత్2 వంటి సినిమాల్లో నటించారు. ఒకప్పుడు లిప్ కిస్, రొమాంటిక్ సీన్స్‌తో సినిమాలు చేయని హీరోగా ముద్ర వేసుకున్నారు ఇమ్రాన్ హష్మీ. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం డిఫరెంట్ రోల్స్ చేస్తూ అలరిస్తున్నారు. అయితే గతంలో ఇమ్రాన్ హష్మీ బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యా రాయ్‌పై చేసిన కామెంట్స్ వల్ల విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కున్నారట.

ఇమ్రాన్ హష్మీ 2014 లో ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో జరిగిన ర్యాపిడ్ ఫైర్‌లో ప్లాస్టిక్ అనే పదం ఏ నటితో పోలుస్తారు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇమ్రాన్ అస్సలు ఆలోచించకుండా ఐశ్వర్యా రాయ్ పేరు చెప్పారట. అంతే షోలో అంతా షాకయ్యారట. ఈ ప్రశ్న షోలో ఉంచాలా? లేదా అనే డైలామాలో పడ్డ నిర్వాహకులు ఫైనల్‌గా ఉంచేసారట. యథాతథంగా అది ప్రసారం కావడంతో ఇమ్రాన్ హష్మీ విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేశారట. నిజానికి తాను ఐశ్వర్యా రాయ్‌కి పెద్ద ఫ్యాన్ అని.. షోలో జరిగిన గేమ్‌లో భాగంగా తాను ఒక వస్తువును సెలబ్రిటీతో పోల్చి చెప్పమంటే సరదాగా తన పేరు చెప్పానని.. ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారట ఇమ్రాన్ హష్మీ. ఎంత ట్రోలింగ్ జరిగి ఉంటే ఇమ్రాన్ హష్మీ ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ ను మర్చిపోలేకపోయారో కదా. ఏం మాట్లాడిన  కాస్త జాగ్రత్తగా మాట్లాడాలనే విషయం ఇమ్రాన్ హష్మీ అనుభవం చెబుతుంది.

Niharika Konidela : ప్రేమ గురించి పోస్టు పెట్టిన మెగా డాటర్..మళ్లీ లవ్‌లో పడిందా?

ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం తెలుగులో కూడా దూసుకుపోతున్నారు. పవన్ కల్యాణ్ ‘OG’ సినిమాలో విలన్‌గా.. అడవి శేష్ గూఢ చారి సినిమా ‘గూఢచారి2’ లో నటిస్తున్నారు.