Niharika Konidela : ప్రేమ గురించి పోస్టు పెట్టిన మెగా డాటర్.. మళ్లీ లవ్‌లో పడిందా?

మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. మళ్లీ ప్రేమలో పడ్డారా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Niharika Konidela : ప్రేమ గురించి పోస్టు పెట్టిన మెగా డాటర్.. మళ్లీ లవ్‌లో పడిందా?

Niharika

Niharika Konidela  : మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. నటిగా..నిర్మాతగా.. యూట్యూబర్‌గా కూడా పేరుతెచ్చుకున్న నిహారిక గతేడాది భర్త చైతన్య నుండి విడాకులు తీసుకున్నారు. రీసెంట్‌గా నిహారిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చూస్తే మళ్లీ ప్రేమలో పడ్డారా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె మొదట యాంకర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ‘ముద్దపప్పు ఆవకాయ్’ వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించారు. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా మారిన నిహారిక ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి సినిమాల్లో నటించారు. గతేడాది ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్ సిరీస్ కూడా చేశారు. పలు OTT సినిమాలకు నిర్మాతగా కూడా పనిచేశారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే 2020 లో చైతన్యతో నిహారికకు పెళ్లైంది. పెళ్లైన కొద్దిరోజులకే ఇద్దరి మధ్యా స్పర్థలు రావడంతో 2023 మేలో మ్యుచువల్ డైవర్స్ తీసుకున్నారు. కాగా లేటెస్ట్‌గా నిహారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.

Also Read : మెగాస్టార్ ‘విశ్వంభర’లో.. ఆ ఇద్దరు హీరోయిన్స్ కూడా..? పదేళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..?

‘నీకు కావాల్సింది ప్రేమ..బీచ్ మాత్రమే’ అంటూ నిహారిక తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. దీంతో అంతా నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రస్తుతానికి తాను సింగిల్ అని..లైఫ్‌లో హ్యాపీగా ఉన్నానని నిహారిక చెప్పారు. మరి ఈ పోస్టు ఏ ఉద్దేశంతో పెట్టి ఉంటారో? అని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.

Also Read: Rakul Preet Singh Wedding.. వైరల్ అవుతున్న రకుల్ పెళ్లి వీడియో.. ఓ రేంజ్‌లో ఉందిగా..

Niharika

Niharika