Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’లో.. ఆ ఇద్దరు హీరోయిన్స్ కూడా..? పదేళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..?

తాజాగా విశ్వంభర సినిమాలో మరో ఇద్దరు భామలు కూడా నటించబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’లో.. ఆ ఇద్దరు హీరోయిన్స్ కూడా..? పదేళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..?

Actress Surabhi and Esha Chawla will play Key Roles in Megastar Chiranjeevi Vishwambhara Movie Rumors goes Viral

Updated On : February 23, 2024 / 4:16 PM IST

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా సోషియో ఫాంటసీ కథతో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరో వైపు షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. మెగాస్టార్ కూడా ఓ షెడ్యూల్ షూటింగ్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి అమెరికాలో ఉండటంతో విశ్వంభర షూట్ కి చిన్న గ్యాప్ ఇచ్చారు.

ఈ సినిమాలో త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తోందని అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో మరో ఇద్దరు భామలు కూడా నటించబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. విశ్వంభర సినిమాలో ఓ రెండు ముఖ్య పాత్రలకు హీరోయిన్స్ సురభి(Surabhi), ఇషా చావ్లా(Esha Chawla)లను తీసుకోబోతున్నట్టు సమాచారం. మెగాస్టార్ తో వీరికి కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది.

ఇషా చావ్లా తెలుగులో గతంలో ప్రేమ కావాలి, పూలరంగడు, mr పెళ్ళికొడుకు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించి తర్వాత సినిమాలకు దూరమైంది. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ పదేళ్ల తర్వాత ఇషా చావ్లా విశ్వంభర సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ తల్లికి ఆపరేషన్.. మీ బ్లెస్సింగ్స్ కావాలంటూ ఎమోషనల్ పోస్ట్..

తెలుగులో బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా.. లాంటి హిట్ సినిమాలతో మెప్పించిన సురభి అడపాదడపా సౌత్ లో సినిమాలు చేస్తుంది. సురభి చివరిసారిగా తెలుగులో 2019 లో శశి సినిమాలో కనిపించింది. ఇప్పుడు మళ్ళీ విశ్వంభరతో రానుంది. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ విశ్వంభరలో నటిస్తున్నట్టు ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక విశ్వంభర షూట్ నెక్స్ట్ షెడ్యూల్ మార్చ్ మొదటివారంలో మొదలు కానుంది. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి 10 జనవరి 2025 రిలీజ్ చేస్తామని ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించారు.