Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ తల్లికి ఆపరేషన్.. మీ బ్లెస్సింగ్స్ కావాలంటూ ఎమోషనల్ పోస్ట్..

పాయల్ రాజ్‌పుత్ తల్లి నిర్మల రాజ్‌పుత్ వాకర్ సహాయంతో నడుస్తున్న ఓ చిన్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి...

Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ తల్లికి ఆపరేషన్.. మీ బ్లెస్సింగ్స్ కావాలంటూ ఎమోషనల్ పోస్ట్..

Payal Rajput Emotional post on her Mother Nirmal Rajput

Updated On : February 23, 2024 / 3:10 PM IST

Payal Rajput : హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇటీవలే మంగళవారం సినిమాతో మంచి విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత మంగళవారం సినిమాతో హిట్ కొట్టడంతో పాయల్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. వరుసగా సినిమాలు చేస్తున్న పాయల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

పాయల్ రాజ్‌పుత్ తల్లి నిర్మల రాజ్‌పుత్ వాకర్ సహాయంతో నడుస్తున్న ఓ చిన్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి.. మా అమ్మకి మోకాలికి ఆపరేషన్ అయింది, ఈ ఆపరేషన్ చాలా పెయిన్ ఫుల్, అయినా ఆపరేషన్ సక్సెస్ అయి అమ్మ నడుస్తోంది. మీ అందరి బ్లెస్సింగ్స్ మా అమ్మకి కావాలి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Also Read : Ananya Nagalla : పిల్లబచ్చాలు మా సినిమాకి రావొద్దు.. అనన్య నాగళ్ళ అంత మాట అనేసిందేంటి..

దీంతో పాయల్ రాజ్‌పుత్ పోస్ట్ వైరల్ అవ్వగా అభిమానులు, పలువురు నెటిజన్లు పాయల్ తల్లి త్వరగా కోలుకోవాలని పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పాయల్ తన తల్లి వద్దే ఉండి జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు తెలుస్తుంది.