×
Ad

Supritha : శివాజీ వ్యాఖ్యలపై సురేఖవాణి కూతురు సుప్రీత కామెంట్స్.. అబ్బాయిలు అండర్‌వేర్ మీద తిరగరు కదా..

ఓ ఇంటర్వ్యూలో శివాజీ చేసిన కామెంట్స్ పై స్పందించింది సుప్రీత. (Supritha)

Supritha

Supritha : సీనియర్ నటి సురేఖవాణి కూతురు సుప్రీత ఇప్పటికే టీవీ షోస్, సోషల్ మీడియాతో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. సుప్రీత అమరావతికి ఆహ్వానం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 13న రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుప్రీత వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది.(Supritha)

ఓ ఇంటర్వ్యూలో శివాజీ చేసిన కామెంట్స్ పై స్పందించింది సుప్రీత. ఇటీవల శివాజీ హీరోయిన్స్ ని మంచి బట్టలు వేసుకోండి బయటకు వచ్చినపుడు అని చెప్పాడు. కాకపోతే ఆ మాట చెప్తూ అసభ్యకరమైన పదాలు వాడటంతో అది తప్పుగా వెళ్లి వైరల్ అయి పెద్ద వివాదమే అయింది. దీంతో శివాజీ వ్యాఖ్యలపై కొంతమంది విమర్శలు చేస్తున్నా సామాన్యులు, పలువురు సెలబ్రిటీలు మాత్రం సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Supritha : మా అమ్మకు ఇంకో పెళ్లి చేయాలి.. వాళ్ళు ఓకే అన్నా మా అమ్మ మాత్రం.. సుప్రీత వ్యాఖ్యలు వైరల్..

యాంకర్ దీని గురించి ప్రశ్నించగా సుప్రీత కూడా శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన అన్న పదాలు తప్పు అయి ఉండొచ్చు కానీ ఆయన చెప్పిన అర్ధం మాత్రం మంచిదే అది తీసుకోవాలి. ఎక్కడికి ఎలా వేసుకెళ్ళాలి బట్టలు అని తెలుసుకోవాలి. మీరు అండర్‌వేర్ మీద తిరగరు కదా. చక్కగా ప్యాంట్ షర్ట్ వేసుకొస్తారు. అబ్బాయిలు ఇంటర్వ్యూ కి వెళ్తే ఫార్మల్స్ వేసుకెళ్తారు. పెళ్ళికి షార్ట్ టీ షర్ట్ వేసుకెళ్ళం కదా. ఎక్కడ ఏ బట్టలు వేసుకోవాలి తెలియాలి. అది తెలిస్తే మంచిది. అప్పుడు ఇలాంటి గొడవలు ఉండవు.

గోవాలో నేను షార్ట్ టీ షర్ట్ వేసుకొని వెళ్తా కానీ అక్కడ చుడీదార్ వేయలేను. ఇక్కడ జనాల్లోకి షార్ట్ టీ షర్ట్ వేసుకొని వస్తే బాగోదు. ఎక్కడ ఎలా కనపడాలి జనాలకు అని మనకు తెలిస్తే చాలు. అమ్మాయిల గురించే కాదు అబ్బాయిల గురించి కూడా అంతే వరస్ట్ గా మాట్లాడుతున్నారు ఇప్పటి సమాజంలో అని తెలిపింది.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ 2027 సంక్రాంతి టార్గెట్.. అజ్ఞాతవాసి తర్వాత మళ్ళీ ఇప్పుడే..