Varalaxmi Sarathkumar : ద‌ర్శ‌కుడి ఆరోప‌ణ‌లు.. స్పందించిన వ‌ర‌లక్ష్మీ.. సోష‌ల్ మీడియాలో డిలీట్ చేసిన పోస్ట్ ఎవ‌రిని ఉద్దేశించి?

నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar ) నటించిన తాజా చిత్రం 'పోలీస్‌ కంప్లైంట్‌' విడుదలకు సిద్ధమవుతున్న త‌రుణంలో సరికొత్త వివాదం త‌లెత్తింది.

Actress Varalakshmi Sarathkumar responds to police complaint director allegations

Varalaxmi Sarathkumar : నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన తాజా చిత్రం ‘పోలీస్‌ కంప్లైంట్‌’ విడుదలకు సిద్ధమవుతున్న త‌రుణంలో సరికొత్త వివాదం త‌లెత్తింది. ఈ చిత్ర‌ ప్రమోషన్స్‌కు ఆమె ఏమాత్రం సహకరించడం లేదని, భారీగా రెమ్యూనరేషన్ తీసుకుని కూడా పబ్లిసిటీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని దర్శకుడు సంజీవ్‌ మేగోటి ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బింగ్ సమయంలోనూ ఆమె తమను ఎంతో ఇబ్బంది పెట్టిందని, ప్రమోషన్స్ కోసం కనీసం ఒక్క గంట సమయం కూడా కేటాయించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు చేసిన ఈ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపాయి.

ఈ వివాదంపై నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎట్టకేలకు స్పందించారు. ద‌ర్శ‌కుడు చేసిన ఆరోపణలను ఆమె తిరస్కరించారు. సినిమా మేకర్స్‌కు తన అవసరం ఉన్నప్పుడల్లా తాను అందుబాటులోనే ఉన్నానని, వారు పిలిచిన ప్రతి ఈవెంట్‌కు తాను హాజరయ్యానని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఆ వేడుకలో దర్శకుడు తన గురించి ఖచ్చితంగా ఏం మాట్లాడారో తనకు ఎవరూ పూర్తిగా చెప్పలేదని, అందుకే దానిపై పూర్తి స్పష్టత లేకుండా మాట్లాడటం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

Bhairavi Ardhya : ఈ హీరోయిన్ కొంచెం రష్మికలా ఉందే.. భైరవి ఆద్య ఫొటోలు..

వివాదాల జోలికి వెళ్లకుండా తన పని తాను చూసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తానని వరలక్ష్మి పేర్కొన్నారు. కొన్ని విషయాల్లో తనకంటూ కొన్ని సొంత అభిప్రాయాలు, కారణాలు ఉంటాయని, అంతమాత్రాన చిత్ర బృందం చేస్తున్న ఆరోపణల గురించి బహిరంగంగా చర్చించి రచ్చ చేయాలని తాను అనుకోవడం లేదని తెలిపారు. ఇదే విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తాను అందరిలా నిందలు వేస్తూ కూర్చోనని, తన పనిపైనే దృష్టి పెడతానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన నోట్‌ను కూడా పంచుకున్నారు.

అయితే.. ఈ నోట్‌ను పంచుకోవడాని క‌న్నా ముందు ‘అరిచే కుక్కలు కరవడం చాలా అరుదు.. నేను అరవను, కరుస్తా’ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ ద‌ర్శ‌కుడిని ఉద్దేశించే పెట్టింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఏమైందో తెలియ‌దు కానీ కొద్ది సేప‌టి త‌రువాత ఆ పోస్టును ఆమె డిలీట్ చేసింది. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఈ పోస్ట్‌కు సంబంధించిన స్ర్కీన్ షాట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చే న‌డుస్తోంది.

ఇదిలా ఉంటే.. హారర్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘పోలీస్‌ కంప్లైంట్‌’ చిత్రం జూన్ 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో వ‌రలక్ష్మితో పాటు నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది కీలక పాత్రలు పోషించారు.