Adivi Sesh : వాళ్లకు ఇచ్చిన మాట కోసం.. బాలీవుడ్ సినిమాలు వదిలేసుకుంటున్న అడివి శేష్..
అడివి శేష్ కి మేజర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా మంచి ఫేమ్ వచ్చింది. (Adivi Sesh)
Adivi Sesh
Adivi Sesh : మొదటి సినిమా నుంచి వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు అడివి శేష్. వరుసగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో వచ్చిన అడివి శేష్ ఇప్పుడు లవ్ యాక్షన్ సినిమా డెకాయిట్ తో రాబోతున్నాడు. డెకాయిట్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ప్రస్తుతం శేష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
అయితే అడివి శేష్ కి మేజర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా మంచి ఫేమ్ వచ్చింది. మేజర్ సినిమా బాలీవుడ్ లో కూడా హిట్ అయి అక్కడ కూడా శేష్ కి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు డెకాయిట్ సినిమా కూడా బాలీవుడ్ లో భారీగానే రిలీజ్ చేస్తున్నారు. నేడు అడివి శేష్ మీడియాతో మాట్లాడగా మేజర్ తర్వాత బాలీవుడ్ లో మీకు ఫేమ్ వచ్చింది కదా అక్కడ నుంచి ఆఫర్స్ వచ్చాయా అని మీడియా ప్రతినిధి అడిగారు.
Also Read : Dhurandhar Working Stills : ‘ధురంధర్’ సినిమా వర్కింగ్ స్టిల్స్ చూశారా..?
దీనికి అడివి శేష్ సమాధానమిస్తూ.. బాలీవుడ్ లో దాదాపు ఆరు సినిమాలు ఆఫర్స్ వచ్చాయి. అందులో రెండు బయోపిక్స్, నాలుగు వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు. అయితే నేను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ కి మాట ఇచ్చాను. ఆ సినిమా ప్యాషన్ తో తీస్తాను, కమర్షియల్ గా కాదు. ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలు చేయను అని. వాళ్లకు ఇచ్చిన మాట ప్రకారం నేను వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఒప్పుకోవట్లేదు. నేను డబ్బుల కోసం సినిమాలు చేస్తే నైతికంగా కరెక్ట్ కాదు. అందుకే నేను ఆ సినిమాలకు నో చెప్పాను. అలాగే బయోపిక్స్ కూడా ఆ కథలు నాకు ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. బయోపిక్స్ అంటే లైఫ్ లో అప్ & డౌన్స్ ఉండాలి. కానీ వాళ్ళు చెప్పిన కథలో హీరో ఎదుగుతూనే ఉంటాడు. అందుకే ఆ కథలకు నో చెప్పాను. నాకు నచ్చే పర్ఫెక్ట్ కథ వస్తే కచ్చితంగా బాలీవుడ్ లో చేస్తాను అని తెలిపాడు.
మేజర్ సినిమా ముంబై ఉగ్రదాడుల్లో మరణించిన ఆర్మీ అధికారి సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. అతని కథని సినిమాగా తీయడానికి చాలా మంది ప్రయత్నించారు. కానీ సందీప్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. అడివి శేష్ ఇచ్చిన మాట వల్లే వాళ్ళు ఒప్పుకొని మేజర్ సినిమాకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో అడివి శేష్ సందీప్ పేరెంట్స్ కి మరింత దగ్గరయి ఓ ఫ్యామిలీలా వాళ్ళతో కలిసిపోయాడు. వాళ్లకు ఇచ్చిన మాట కోసం శేష్ వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఇకపై చేయడు అని తెలుస్తుంది.
Also Read : Vandana Kammula : రష్మిక బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూతురు..
