×
Ad

Mangalavaaram : ‘మంగళవారం’ టీజర్ రిలీజ్.. ఈ సారి పాయల్‌తో కలిసి భయపెట్టడానికి రెడీ అయిన RX 100 డైరెక్టర్..

అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా సినిమా 'మంగళవారం'. ఇందులో పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ లో నటిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'మంగళవారం' సినిమా టీజర్ తాజాగా విడుదల చేశారు.

  • Published On : July 4, 2023 / 01:36 PM IST

Ajay Bhupathi Payal Rajput Mangalavaaram Teaser Released

Mangalavaaram Teaser :  ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అజయ్ భూపతి సరికొత్త వినోదాన్ని పరిచయం చేశారు. ఇంటెన్సిటీతో కూడిన యాక్షన్, రొమాన్స్, షాకింగ్ ట్విస్ట్‌లను కలిపి కల్ట్ సినిమా చూపించారు. ‘మహాసముద్రం’లో యాక్షన్ డోస్ మరింత పెంచారు. ఆ రెండు సినిమాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘మంగళవారం’. ఇందులో పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ లో నటిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం నిర్మాణంలో అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘మంగళవారం’ సినిమా టీజర్ తాజాగా విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పచ్చటి తోటలు… వాటి మధ్యలో ఊరు… ఆ ఊరి మధ్యలో ఓ అమ్మవారి గుడి… వందల మంది ప్రజలు… ప్రజల కళ్ళల్లో ఒక్కసారిగా ఆశ్చర్యంతో కూడిన భయం, ఆఖరి మూగ జంతువుల కళ్ళలో కూడా.. అందుకు కారణం ఏంటి అనేది తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. టీజర్ లో అమ్మవారిని చూపించడం, గొంగళి కప్పుకొని మంటల మధ్యలో పాయల్ నిలబడటం, చివరిలో గట్టిగా ఆవేదన వ్యక్తం చేస్తూ అరవడం… ఇలా టీజర్ అంతా ఆసక్తిగా సాగింది.

Sitara : తండ్రిని మించిన కూతురు.. నగల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో సితార కొత్త యాడ్..

మొదటి సినిమాలో పాయల్ తో లవ్, రొమాన్స్ చూపించిన అజయ్ భూపతి ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్ తో భయపెట్టబోతున్నాడని అర్ధమవుతుంది. టీజర్ రిలీజ్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మంగళవారం సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.