Ajay Devgn Injured : సింగం 3 షూటింగ్‌లో గాయపడిన అజయ్ దేవ్‌గణ్..! కంటికి తీవ్ర గాయం..!
Ajay Devgn : బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్న చిత్రం సింగం 3. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
- Thota Vamshi Kumar
- Published On : December 4, 2023 / 03:34 PM IST
Ajay Devgn Injured
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్న చిత్రం సింగం 3. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సింగం సిరీస్‌లో మూడో సినిమాగా రాబోతుంది. మొదటి రెండు చిత్రాలు ఘన విజయాలు అందుకోవడంతో ఈ చిత్రంపై బాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగినట్లే ఈ సినిమాను నిర్మిమితమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అయితే.. ఈ సినిమా సెట్స్‌లో హీరో అజయ్ దేవ్‌గణ్ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఓ ఫైటింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా అనుకోకుండా అజయ్ దేవ్‌గణ్ గాయపడ్డాడు. అతడి కన్నుకు గాయమైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం డాక్టర్‌ను పిలిపించారు. అజయ్ దేవ్‌గణ్ తన కంటికి చికిత్స చేయించుకున్నాడు. కొద్ది సేపు విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నట్లు బాలీవుడ్‌లో పలు కథనాలు వస్తున్నాయి. దీనిపై దర్శకుడు రోహిత్ శెట్టి గానీ, హీరో అజయ్ దేవ్‌గణ్ గానీ, చిత్ర బృందం గానీ స్పందించలేదు.
Allu Aravind : చిరంజీవిపై కామెంట్స్ చేస్తున్న వారిపై అల్లు అరవింద్ ఫైర్.. అసలు ఏమైంది..?
సినిమా విడుదల వాయిదా పడే అవకాశం..!
సింగం 3 సినిమాలో కరీనా కపూర్, దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2024 అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే.. అదే రోజున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కూడా రిలీజ్ కానుంది.
పుష్ప చిత్రం బాలీవుడ్‌లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో సింగం 3 సినిమా విడుదల తేదీని మారుస్తారు అనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ఒకేసారి విడుదల చేయడం ఎందుకని రోహిత్ శెట్టి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
