Ajith Kumar : అజిత్ కుమార్ బర్త్‌డే.. నెక్స్ట్ సినిమా టైటిల్ అనౌన్స్.. #AK62 ఎవరూ ఊహించలేదుగా ఈ కాంబో..

తాజాగా అజిత్ పుట్టిన రోజు సందర్భంగా అజిత్ నెక్స్ట్ సినిమాని, టైటిల్ ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తమిళ్ లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ అజిత్ 62వ సినిమాను నిర్మిస్తుంది.

Ajith Kumar next movie #AK62 title announced

Ajith Kumar :  తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ పుట్టిన రోజు నేడు. ఇప్పటికే అజిత్ అభిమానులు తమిళనాడు అంతా ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేస్తున్నారు. అజిత్ చివరి సారిగా తునివు సినిమాలో కనిపించారు. సంక్రాంతికి రిలీజయిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత అజిత్ నెక్స్ట్ సినిమాపై చాలా వార్తలు వచ్చాయి. అజిత్ 62వ సినిమా దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఉంటుందని కూడా ప్రకటించారు. కానీ ఆ సినిమా పలు అనివార్య కారణాలతో ఆగిపోయింది.

తాజాగా అజిత్ పుట్టిన రోజు సందర్భంగా అజిత్ నెక్స్ట్ సినిమాని, టైటిల్ ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తమిళ్ లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ అజిత్ 62వ సినిమాను నిర్మిస్తుంది. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాతో ప్రెకషకుల ముందుకు వచ్చింది ఈ నిర్మాణ సంస్థ. నేడు అజిత్ పూర్త్తిన రోజు కావడంతో అజిత్ తో తాము నెక్స్ట్ సినిమా చేయబోతున్నామని ప్రకటించారు. #AK62 సినిమాకు ‘Vidaa Muyarchi’ అనే టైటిల్ ని పెట్టారు. అంటే తెలుగులో పట్టుదల అని అర్ధం.

Sara Arjun : PS2 లో జూనియర్ ఐశ్వర్యరాయ్ గా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? మీకు బాగా తెలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంత పెద్దదైపోయిందో..

ఈ ‘Vidaa Muyarchi’ సినిమాని ప్రముఖ తమిళ్ డైరెక్టర్ మగిజ్ తిరుమణి తెరకెక్కిస్తున్నాడు. గతంలో తడం, మేఘమాన్, తడైర తక్కా.. లాంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు. నటుడిగా కూడా పలు సినిమాల్లో కనిపించాడు తిరుమణి. ఇప్పుడు లైకా నిర్మాణంలో అజిత్ కుమార్ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించనున్నాడు. టైటిల్ చాలా పవర్ ఫుల్ గా పోస్టర్ రిలీజ్ చేయడంతో ప్రస్తుతం ఈ టైటిల్ వైరల్ గా మారయింది. ఇక అజిత్ నెక్ట్ సినిమాని ఇలా సడెన్ గా ఆయన బర్త్ డే రోజు ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమానులు, పలువురు ప్రముఖులు అజిత్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు