Akash Puri : RC ట్రెండ్ సెట్టర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆకాష్ పూరి.. ఆ సినిమాకు అయితే సీక్వెల్ చేస్తా.. రిలేషన్ షిప్ గురించి..

ఆకాష్ పూరి కూడా RC ట్రెండ్ సెట్టర్స్ అనే ఓ క్లాతింగ్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.

Akash Puri : RC ట్రెండ్ సెట్టర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆకాష్ పూరి.. ఆ సినిమాకు అయితే సీక్వెల్ చేస్తా.. రిలేషన్ షిప్ గురించి..

Akash Puri as Brand Ambassador for RC Trend Setters Clothing Brand Akash Puri Interesting Comments on Movies

Akash Puri : పూరి జగన్నాధ్(Puri Jagannadh) తనయుడిగా ఆకాష్ పూరి చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినీ పరిశ్రమకు పరిచయమై అనంతరం మెహబూబా సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత రొమాంటిక్, చోర్ బజార్ అంటూ వచ్చినా అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ రాబోయే సినిమాకు కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాడు ఆకాష్ పూరి. ఇక సెలబ్రిటీలు అంతా పలు యాడ్స్ చేయడం, పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉండటం చేస్తూ ఉంటారు. తాజాగా అదే బాటలో ఆకాష్ పూరి కూడా RC ట్రెండ్ సెట్టర్స్ అనే ఓ క్లాతింగ్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. నేడు దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఆకాష్ పూరితో పాటు RC ట్రెండ్ సెట్టర్స్ యజమానులు రమేష్, రోమన్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆకాష్ పూరి ఈ బ్రాండ్ గురించి, తన సినిమాల గురించి మాట్లాడి అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆకాష్ పూరి మాట్లాడుతూ.. నేను మొదటిసారి ఓ బ్రాండ్ కి అంబాసిడర్ గా చేస్తున్నాను. అందుకు సంతోషంగా ఉంది. RC ట్రెండ్ సెట్టర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని రమేష్, రోమన్ నన్ను కలిసి వాళ్ళ విజన్స్, థాట్స్ నాకు చెప్పినప్పుడు, నేను రెగ్యులర్ గా వాడేవి కాకుండా కొత్త కొత్త కలెక్షన్స్ చూపిస్తే మొదట ఆలోచించినా తర్వాత నాకు నచ్చి ఈ బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పుకున్నాను. దీని గురించి నేను సోషల్ మీడియాలో చెప్పినప్పుడు మంచి స్పందన వచ్చింది త్వరలో మరిన్ని బ్రాండ్స్ కి కూడా అంబాసిడర్ గా ఉండబోతున్నాను అని తెలిపారు.

Also Read : Allu Arjun : వైజాగ్‌లో ‘పుష్ప’ ఎంట్రీ.. బన్నీ కోసం భారీగా తరలి వచ్చిన అభిమానులు..

ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. నా గత సినిమా చోర్ బజార్ అంతగా ఆడలేదు. ఇకపై స్టోరీలు మరింత జాగ్రత్తగా వింటాను. ఓ లవ్ స్టోరీ, ఓ యాక్షన్ కథ ఉన్నాయి. అవి ఫైనలైజ్ చేయాలి. త్వరలో ఆ సినిమా వివరాలు అధికారికంగా ప్రకటిస్తాము. నేను ఇప్పటికీ చిన్న పిల్లాడిలా ఉంటాను అంటారు. అందుకే హీరోగా ఇంకా సెటిల్ అయ్యాక విలన్ గా కూడా ఆలోచిస్తాను. నాకు సొంతంగా పేరు వచ్చేదాకా మళ్ళీ నాన్న డైరెక్షన్ లో నటించను అని ఫిక్స్ అయ్యాను. ఇటీవల మన ఇండస్ట్రీలో కార్తికేయ 2, హనుమాన్.. లాంటి గొప్ప సినిమాలు వచ్చి హిట్ అవుతున్నాయి. తేజ సజ్జ నా ఫ్రెండ్, అంత మంచి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నాన్న – రామ్ డబుల్ ఇస్మార్ట్ చాలా బాగా వస్తోంది. ఇటీవలే టీజర్ రఫ్ కట్ చూశాను. చాలా బాగుంది. నేను సీక్వెల్స్ చేయను కానీ అవకాశం వస్తే నాన్న గారి నేనింతే సినిమాకు సీక్వెల్ చేస్తాను. నాకు ఆ సినిమా చాలా ఇష్టం. ప్రస్తుతానికి నేను సింగిల్ గానే ఉన్నాను. ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదు అంటూ తన రిలేషన్స్ గురించి కూడా చెప్పేసారు ఆకాష్ పూరి.

Akash Puri

ఇక ఇదే ప్రెస్ మీట్ లో RC ట్రెండ్ సెట్టర్స్ ఓనర్స్ రమేష్, రోమన్ మాట్లాడుతూ.. మొదట ఆన్లైన్ లో మొదలుపెట్టి తర్వాత షాప్స్ పెట్టాము. త్వరలో హైదరాబాద్ లో ఇంకో షాప్ ఓపెన్ చేస్తున్నాము. ఆ షాప్ ఓపెనింగ్ కోసం అనుకోని ఆకాష్ పూరి వద్దకు వెళ్లి మాట్లాడి ఆ తర్వాత ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా ఆకాష్ గారు ఒప్పుకోవడం సంతోషంగా ఉంది అని తెలిపారు.