Allu Arjun : వైజాగ్‌లో ‘పుష్ప’ ఎంట్రీ.. బన్నీ కోసం భారీగా తరలి వచ్చిన అభిమానులు..

ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2 షూట్ జరగగా నెక్స్ట్ షెడ్యూల్ ఇప్పుడు వైజాగ్ లో జరగనుంది. దీంతో అల్లు అర్జున్ నేడు వైజాగ్ వెళ్లారు.

Allu Arjun : వైజాగ్‌లో ‘పుష్ప’ ఎంట్రీ.. బన్నీ కోసం భారీగా తరలి వచ్చిన అభిమానులు..

Updated On : March 10, 2024 / 3:21 PM IST

Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 (Pushpa) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ రావడంతో బన్నీ, సుకుమార్ పుష్ప 2ని మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2 షూట్ జరగగా నెక్స్ట్ షెడ్యూల్ ఇప్పుడు వైజాగ్ లో జరగనుంది. దీంతో అల్లు అర్జున్ నేడు వైజాగ్ వెళ్లారు.

అల్లు అర్జున్ వైజాగ్ వస్తున్నాడు అని తెలియడంతో భారీ ఎత్తన అభిమానులు ఎయిర్‌పోర్ట్ కి వచ్చారు. నేడు మధ్యాహ్నం బన్నీ వైజాగ్ ఎయిర్‌పోర్ట్ లో దిగగా అక్కడి నుంచి బన్నీ ఉండే హోటల్ వరకు బైక్ ర్యాలీతో అభిమానులు అల్లు అర్జున్ ని తీసుకెళ్లారు. అల్లు అర్జున్ పై పూల వర్షం కురిపించారు. ఫోటోల కోసం ఎగబడ్డారు. వైజాగ్ రోడ్లన్నీ బన్నీ అభిమానులతో నిండిపోయాయి. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వైజాగ్ ఎంట్రీ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

Allu Arjun went to Vizag for Pushpa 2 Shoot Fans Rally for Allu Arjun

Also Read : Prabhas : ప్రభాస్‌కి ఇంకా మోకాలి గాయం తగ్గలేదా.. వైరల్ అవుతున్న ఫోటో..

వైజాగ్ లో బన్నీ అభిమానుల ర్యాలీతో మరోసారి అభిమానుల హంగామా చూపించారు. రేపట్నుంచి వైజాగ్ పోర్ట్ లో పుష్ప 2 షూటింగ్ జరగనుందని సమాచారం. ఇక పుష్ప 2 సినిమా 15 ఆగస్టు 2024 రిలీజ్ అవుతుందని ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు పుష్ప 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.