Akash Puri : RC ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇస్తున్నా అంటున్న ఆకాష్ పూరి..
RC ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇస్తున్నా అంటున్న ఆకాష్ పూరి. అసలు విషయం ఏంటి..?
- gum 95921
- Published On : March 9, 2024 / 05:39 PM IST
Akash Puri said he is coming into RC family post gone viral
Akash Puri : టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ‘ఆకాష్ పూరి’. పూరి సినిమాల్లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఆడియన్స్ కి పరిచయమైన ఆకాష్.. 2018లో ‘మెహబూబా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత రొమాంటిక్, చోర్ బజార్ వంటి సినిమాలతో కూడా ప్రేక్షకులను పలకరించారు. కానీ ఈ మూడు చిత్రాల్లో ఏది విజయాన్ని అందించలేకపోయింది.
2022 తరువాత ఆకాష్ మరో సినిమాని ప్రకటించలేదు. ఈ రెండేళ్లలో సోషల్ మీడియాలో కూడా ఇన్ యాక్టీవ్ గా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సడన్‌గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేశారు. నేను RC ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇస్తున్నా అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇక్కడ RC అంటే రామ్ చరణ్ అనుకుంటారేమో.. అలా అనుకుంటే మీరు పొరబడినట్లే. ఇక్కడ RC అంటే ఒక ఫ్యాషన్ బ్రాండ్.
Also read : Sai Durgha Tej : మెగా కాంపౌండ్ నుంచి మరో నిర్మాత.. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే..
RC ట్రెండ్ సెట్టర్స్ అనే ఫ్యాషన్ బ్రాండ్ కి ఆకాష్ పూరి బ్రాండ్ అంబాసడర్ గా సైన్ చేశారు. ఆ విషయాన్ని తెలియజేస్తూనే ఆకాష్ పోస్ట్ వేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్.. ఆకాష్ ని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ప్రశ్నలు వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆడియన్స్ లో కనిపిస్తున్న ఈ ఆసక్తిని చూసి ఆకాష్.. త్వరలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి.
కాగా ఆకాష్ ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘మెహబూబా’ సినిమాని పూరిజగన్నాథ్ డైరెక్ట్ చేశారు. అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చిన పూరి.. తన కొడుకు ఆకాష్ కి మాత్రం మంచి ఎంట్రీని ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం పూరిజగన్నాథ్.. రామ్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కిస్తున్నారు.
