×
Ad

Akhanda Trailer Roar : ఇదీ బాలయ్య మాస్ ర్యాంపేజ్!

‘అఖండ’ ట్రైలర్ రోర్‌తో సోషల్ మీడియాలో బాలయ్య సెన్సేషన్..

  • Published On : November 15, 2021 / 12:00 PM IST

Akhanda

Akhanda Trailer Roar: నటసింహా నందమూరి బాలకృష్ణ సరైన మాస్ క్యారెక్టర్, పవర్‌ఫుల్ డైలాగ్స్ చెబితే ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి ‘అఖండ’ ట్రైలర్ రోర్ చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’.

Akhanda Trailer : అరాచకం.. నటసింహా నట విశ్వరూపం..

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలు, రెండు లిరికల్ సాంగ్స్ అందర్నీ ఆకట్టుకోవడమే కాక సినిమా మీద అంచనాలను మరింత పెంచాయి. ఆదివారం రాత్రి 7:09 గంటలకు ‘అఖండ’ ట్రైలర్ రిలీజ్ చేశారు టీం.

Akhanda Trailer Roar : ‘అఖండ’ గా బాలయ్య ‘సింహా’ గర్జన..

ఫ్యాన్స్ అయితే గూస్ బంప్స్ అని, ఆడియన్స్ అంతా సింప్లీ సూపర్బ్ అనేశారు. రెండు క్యారెక్టర్లు, డిఫరెంట్ గెటప్స్, పైగా బాలయ్య అఘోరా రోల్‌లో ఎలా ఉండబోతున్నాడో అనేది ట్రైలర్‌లో చూపించి సినిమా పక్కా బ్లాక్‌బస్టర్ అని హింట్ ఇచ్చేశారు. బాలయ్య చెప్పిన డైలాగ్స్ అయితే అదిరిపోయాయి.

ఇప్పటికీ ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో కంటిన్యూ అవుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ‘అఖండ’ ట్రైలర్. 10 మిలియన్లకు పైగా వ్యూస్, 300 K లైక్స్‌తో మాస్ సత్తా ఏంటనేది మరోసారి నిరూపించాడు బాలయ్య. డిసెంబర్ 2న థియేటర్లలో ‘అఖండ’ గా నటసింహా గర్జన స్టార్ట్ కాబోతోంది.