Akira Nandan : ‘లిటిల్ పవర్‌స్టార్’ ఎంట్రీ ఫిక్స్.. అందుకే ఇవన్నీ..
తండ్రి పవన్ కళ్యాణ్ సినిమాతో లిటిల్ పవర్ స్టార్ టాలీవుడ్ ఎంట్రీ..
- sekhar
- Published On : October 26, 2021 / 03:36 PM IST
Akira Nandan
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా ఫస్ట్ నుండీ మెగాభిమానులు అకీరాపై ఫోకస్ పెడుతున్నారు. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లో కుటుంబ సభ్యులతో కలిసి అకీరా కనిపించాడంటే.. ఫ్రేమ్‌లో అతనే హైలెట్ అవుతుంటాడు..
Akira Nandan : లిటిల్ ‘పవర్ స్టార్’.. పదును పెట్టిన కత్తిలా ఉన్నాడుగా..!
కట్ చేస్తే లిటిల్ పవర్ స్టార్ త్వరలోనే తెరంగేట్రం చెయ్యబోతున్నాడనే వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అది కూడా తండ్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో కావడం విశేషం. పవన్ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న హిస్టారికల్ ఫిలిం ‘హరి హర వీర మల్లు’.
Bheemla Nayak : రిలాక్స్ అవుతున్న ‘భీమ్లా నాయక్’.. డానియెల్ శేఖర్.. లుక్ అదిరిందిగా!
ఇప్పటివరకు కొంత టాకీ పార్ట్ పూర్తి చేశారు. త్వరలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ద్వారా అకీరాను ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని క్రిష్, పవన్‌ని రిక్వెస్ట్ చెయ్యగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందుకే అకీరా గతకొద్ది రోజులుగా మార్షల్ ఆర్ట్స్, కర్రసాము వంటివి నేర్చుకుంటున్నాడని అంటున్నారు.
