Major : పవన్ తనయుడిలో ఈ ట్యాలెంట్ చూస్తే ఆశ్చర్యపోతారు.. మేజర్ సాంగ్ కంపోజ్ చేసిన అకిరా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడుగా అకీరా నందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది పవన్ ఫ్యాన్స్.............
- Saketh U
- Published on- June 18, 2022 / 07:14 AM IST
Akiraa
Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడుగా అకీరా నందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పటికే నటన, మార్షల్ ఆర్ట్స్ లాంటి పలు కళల్లో శిక్షణ తీసుకున్నాడు అకిరా. గతంలోనే అకీరా టాలెంట్ గురించి అందరికి తెలుసు. తాజాగా అకీరాలోని మరో ట్యాలెంట్ బయటపడింది.
అకీరాకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. తాజాగా అకీరా నందన్ మేజర్ సినిమాలోని హృదయమా అంటూ సాగే పాటను కీబోర్డ్‌తో కంపోజ్ చేశాడు. ఈ వీడియోని అడివి శేష్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. అడివి శేష్.. అకిరా, ఆద్యలకు బాగా క్లోజ్. గతంలోనే వీరిద్దరితో అడివి శేష్ క్లోజ్ గా గడిపిన కొన్ని ఫోటోలని షేర్ చేసుకున్నాడు.
Pooja Hegde : సొంత స్టేట్‌లో ఎంట్రీ ఇవ్వనున్న పూజా.. యశ్ సరసన?
వీరి మధ్య ఉన్న సన్నిహిత బంధంతో అకిరా అడివిశేష్ కోసం మేజర్ సినిమాలోని పాటని కంపోజ్ చేశాడు. ఈ వీడియోని అడివిశేష్ ట్విట్టర్‌లో షేర్ చేసి.. ”ఈ పాటను కంపోజ్ చేసి పంపినందుకు థ్యాంక్యూ అకీరా. అకిరా కంపోజ్ చేసిన ఈ పాటని చూడు” అంటూ మ్యూజిక్ డైరెక్టర్ శశికిరణ్ ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు, నెటిజన్లు అకిరా నందన్ పై ప్రశంసలు కురిపిస్తూ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోతో అకీరాలో సంగీతం ట్యాలెంట్ కూడా ఇంత ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.
