Akira Nandan : క్లాస్ డైరెక్టర్ తో పవన్ తనయుడి ఎంట్రీ.. ఇది ఎవ్వరూ ఊహించలేదుగా..
తాజాగా అకిరా నందన్ ఫస్ట్ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. (Akira Nandan)
- Saketh U
- Published On : February 10, 2026 / 04:45 PM IST
akira nandan
Akira Nandan : పవన్ తనయుడు అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అకిరా మ్యూజిక్ నేర్చుకుంటున్నాడని, ఆల్రెడీ ఒక షార్ట్ ఫిలింకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేసాడని, తమన్ దగ్గర కూడా పనిచేశాడని అందరికి తెలిసిందే. దీంతో అకిరా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని పలువురు భావిస్తున్నా ఫ్యాన్స్ మాత్రం అకిరా హీరో అవుతాడని ఎదురుచూస్తున్నారు.(Akira Nandan)
రేణు దేశాయ్ కూడా అకిరా ఇష్టం అని తెలిపింది. అకిరా ఎంట్రీపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా అకిరా నందన్ ఫస్ట్ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.
Also Read : Anudeep : అనుదీప్ మామూలోడు కాదు.. ఫంకీ కోసం మొత్తం డైరెక్టర్స్, నిర్మాతలు అందర్నీ దించాడుగా..
అకిరా నందన్ మొదటి సినిమా మాస్ హీరోలా కాకుండా క్లాస్ హీరోలా ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. క్లాస్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అకిరా నందన్ ఎంట్రీ ఉంటుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. పవన్ ఫ్యాన్ బేస్ కి తగ్గట్టు అకిరా కూడా చరణ్ లాగే గ్రాండ్ గా మాస్ అప్పీల్ తో లాంచ్ అవుతుంటాడు అనుకుంటే శేఖర్ కమ్ముల సినిమా అని చెప్పి షాక్ ఇచ్చారని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.
అయితే అకిరా మంచి కథలు ఉన్న సినిమాలు, మనసుకు హత్తుకునే ప్రేమకథలు చేయాలని, పవన్ కూడా అదే సజెస్ట్ చేసాడని, కథల మీద ఫోకస్ చేయమని చెప్పినట్టు తెలుస్తుంది. మరి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అకిరా నందన్ సినిమా నిజంగానే ఉందా ఉంటే ఎప్పుడు వస్తుంది తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అకిరా హీరోగా ఎంట్రీ ఇస్తే నేను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అని పవన్ ఫ్రెండ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా చెప్పారు.
Also Read : Vishwak Sen : అందంగా ఉంటే సరిపోదు యాక్టింగ్ చేయాలి.. హీరోయిన్స్ పై విశ్వక్ సంచలన వ్యాఖ్యలు..
