Akira Nandan : ‘లిటిల్ పవర్‌స్టార్’ ఎంట్రీ ఫిక్స్..!
రేణు దేశాయ్, అకీరా కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియో షేర్ చేశారు..
- sekhar
- Published On : August 3, 2021 / 02:23 PM IST
Akira Nandan
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా ఫస్ట్ నుండీ మెగాభిమానులు అకీరాపై ఫోకస్ పెడుతున్నారు. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లో కుటుంబ సభ్యులతో కలిసి అకీరా కనిపించాడంటే.. ఫ్రేమ్‌లో అతనే హైలెట్ అవుతుంటాడు..
రీసెంట్‌గా రేణు దేశాయ్, అకీరా కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియో షేర్ చేశారు. బ్యాగ్రౌండ్‌లో మైఖేల్ జాక్సన్ ‘బిల్లీ జీన్’ (Billie Jean) సాంగ్‌తో వీడియో అదిరిపోయింది. హీరో అవకముందు పవన్ కూడా కరాటే నేర్చుకున్నారు. ఇప్పుడు అకీరా కూడా తండ్రిలానే కర్రసాము నేర్చుకుంటున్నాడు, ‘లిటిల్ పవర్ స్టార్’ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
Akira Nandan : ‘ఒకే ఒక్కడు’ అకీరా.. బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన రేణూ దేశాయ్..
ఇటీవల పవన్, అకీరా కలిసి ఉన్న పిక్ బాగా వైరల్ అయ్యింది. మంచి ఎత్తు, చక్కటి ఫిజిక్, నూనుగు మీసాలతో.. పవన్ కంటే ఎత్తుగా.. చూడముచ్చటగా ఉన్నాడు ‘లిటిల్ పవర్ స్టార్’ అంటూ మెగా ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు అకీరా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి మరి.
Akira Nandan : లిటిల్ ‘పవర్ స్టార్’.. పదును పెట్టిన కత్తిలా ఉన్నాడుగా..!
