Akkineni Akhil : ఆస్తి విషయంలో నాగార్జునపై అఖిల్ సంచలన కామెంట్స్.. నేను, మా అన్నయ్య..
తాజాగా అఖిల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆస్తి విషయాల గురించి మాట్లాడాడు. (Akkineni Akhil)
- Saketh U
- Published on- July 26, 2026 / 10:17 AM IST
Akkineni Akhil
Akkineni Akhil : అక్కినేని అఖిల్ ఇటీవలే లెనిన్ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. దాదాపు 90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. లెనిన్ ఇచ్చిన జోష్ తో అఖిల్ చాన్నాళ్ల తర్వాత బయటకు వస్తున్నాడు. ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా అఖిల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆస్తి విషయాల గురించి మాట్లాడాడు.
Also Read : Sisindri 2 : ‘సిసింద్రీ 2’ అనౌన్స్ చేసిన అఖిల్.. ఎవరితోనో తెలుసా?
అఖిల్ మాట్లాడుతూ.. మా నాన్న మాకు ఒక మాట క్లారిటీగా చెప్పారు. నేను బతికి ఉన్నంతకాలం మీకు నా నుంచి ఒక్క రూపాయి కూడా రాదు. మీరు సొంతంగా పైకి రావాలి. మీరు కెరీర్లో ఏ మార్గం ఎంచుకున్నా నేను సపోర్ట్ చేస్తాను కానీ మీ ఖర్చులకు మాత్రం నేను డబ్బులు ఇవ్వను అని చెప్పారు. నీకు ఇంతిస్తాను, అన్నయ్యకు ఇంత ఇస్తాను అని నాన్న ఎప్పుడూ చెప్పలేదు. నేను కానీ, అన్న చైతన్య కానీ మేము నాన్న దగ్గర డబ్బులు తీసుకోము. మేము సంపాదించే డబ్బులతోనే మేము బతుకుతున్నాం. ఇది ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.
మేమే కాదు మా ఇంట్లో అందరం ఇదే పాటిస్తాం. మా ఆలోచనలు చాలా బలంగా ఉంటాయి. కష్టపడి ఆస్తి సంపాదించిన ఆయనకు మమ్మల్ని ఎలా ఉంచాలో, ఎలా డైరెక్ట్ చేయాలో తెలుసు చిన్నప్పటి నుంచి కూడా మాకు ఆస్తుల పంపిణీ గురించి కాకుండా కుటుంబ విలువల గురించి చెప్పారు అని తెలిపాడు.
