ఎలా వెళ్లిందబ్బా : కరెంటు సాకెట్‌లో కప్ప, షాకైన అక్షయ్

charging point frog socket : బాలీవుడ్ యాక్షన్ హీరో..అక్షయ్ కుమార్ షాక్‌కు గురైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. తన ఇంట్లోకి అనుకోని అతిథి వచ్చిందని, అసలు ఇది ఎలా వచ్చిందో తెలియడం లేదంటూ..క్వొశ్చన్ వేశారు. అసలా ఎవరా అతిథి అనుకుంటున్నారా ? కప్ప. అవును నిజం. దీనికి సంబంధించిన విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు.

తన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొనేందుకు సాకెట్ దగ్గరకు వెళ్లడం జరిగిందని, కానీ..అక్కడ ఏదో ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఎలక్ర్టిక్ సాకట్ లో కప్ప కూర్చొందని, అది అక్కడకు ఎలా చేరుకుందని ప్రశ్నిస్తూ..ఓ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చూస్తుంటే…అది ఆ ప్లేస్ ను ఆక్రమించినట్టుంది అంటూ సరదాగా పోస్టు చేశారు. ఇది చూసిన..మోడల్, నటుడు, ముజమ్మిల్ ఇబ్రహిం దానికి రెంట్ వసూలు చేస్తున్నారా ? ఫన్నీ కామెంట్ చేశారు.

ఇక అక్షయ్ విషయానికి వస్తే…ఆయన నటించిన ‘లక్ష్మి’ సినిమా గత సంవత్సరం నవంబర్ నెలలో రిలీజ్ అయ్యింది. డిస్నీ హట్‌స్టార్‌లో విడుదలైన ఈ మూవీ…హర్రర్‌ నేపథ్యంలో తెరకెక్కింది. ట్రాన్స్ జెండర్ గా ఈ సినిమాలో వెరైటీ రోల్ పోషించారు. ‘బెల్‌బాటమ్’‌, ‘బచ్చన్‌ పాండే’, ‘సూర్యవంశీ’ సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ‘రక్షబంధన్’‌, ‘పృథ్వీరాజ్’‌ చిత్రాలు చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ లో ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు