×
Ad

Ali : రామ్‌చరణ్‌కి కూతురి పెళ్లి శుభలేఖను అందించిన అలీ దంపతులు..

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన పెద్ద కుమార్తె ‘ఫాతిమా రెమీజు’ను అత్తవారింటికి పంపించబోతున్నాడు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, తెలంగాణ గవర్నర్ తమిళిసైకి, మెగాస్టార్ చిరంజీవికి అలీ సతీసమేతంగా వెళ్లి ఆహ్వానపత్రికలు అందించారు. తాజాగా ఈరోజు ఉదయం టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని కలిసి..

  • Published On : November 13, 2022 / 04:48 PM IST

Ali gave his Daughter wedding invitation to Ram Charan

Ali : టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన పెద్ద కుమార్తె ‘ఫాతిమా రెమీజు’ను అత్తవారింటికి పంపించబోతున్నాడు. ఇక కూతురు పెళ్లి పనులు మొదలుపెట్టిన అలీ.. శుభలేఖలు అందించే పనిలో పడ్డాడు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, తెలంగాణ గవర్నర్ తమిళిసైకి, మెగాస్టార్ చిరంజీవికి అలీ సతీసమేతంగా వెళ్లి ఆహ్వానపత్రికలు అందించారు.

Ram Charan-Akshay Kumar : రామ్ చరణ్, అక్షయ్ కుమార్ ఒకే వేదికపై..

తాజాగా ఈరోజు ఉదయం టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని కలిసి శుభలేఖను అందించారు అలీ దంపతులు. గత కొన్ని రోజులుగా.. జపాన్ ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్ అని, ఆఫ్రికా టూర్ అంటూ విదేశాలను చుట్టేసి రామ్ చరణ్ ఇటీవలే భారత్ కి తిరిగి వచ్చాడు. నిన్న (శనివారం) భారత్ బిగ్గెస్ట్ సమ్మిట్ హిందుస్థాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నాడు.

ఈ సమ్మిట్ కి దక్షణాది సినిమా ఇండస్ట్రీ నుంచి చరణ్ ఒక్కడికే ఆహ్వానం అందుకొవడం గమనార్హం. ఇక నార్త్ నుంచి అక్షయ్ కుమార్ ఈ సమ్మిట్ లో పాల్గొనగా.. వీరిద్దర్నీ వేదికపై పలు ప్రశ్నలు అడగగా సమాధానాలు ఇచ్చారు. ఆ తరువాత చరణ్ అండ్ అక్షయ్ వారి వారి సూపర్ హిట్ సాంగ్స్ కి స్టేజి పైన డాన్స్ చేసి అలరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.