Janhvi Kapoor: ఇప్పటికైతే అవన్నీ పుకార్లే.. మరి జాన్వీ ఎంట్రీ ఎప్పుడు?
అదిగో తారక్.. ఇదిగో రౌడీబాయ్.. అతిలోక సుందరి కూతురు ఈ హీరో సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని గత కొంతకాలంగా రకరకాల ప్రచారాలు జరగుతూనే ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఏ సౌత్..
- Naresh Mannam
- Published On : February 24, 2022 / 11:15 AM IST
Janhvi Kapoor (image:instagram)
Janhvi Kapoor: అదిగో తారక్.. ఇదిగో రౌడీబాయ్.. అతిలోక సుందరి కూతురు ఈ హీరో సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని గత కొంతకాలంగా రకరకాల ప్రచారాలు జరగుతూనే ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఏ సౌత్ ప్రాజెక్ట్ కు జాన్వీ సైన్ చేయలేదని కుండబద్ధలు కొట్టేశారు బోనీకపూర్. ఎన్ని ఆఫర్స్ వస్తున్నా.. ఎందుకు జాన్వీ ఎంట్రీ ఇంకా ఫిక్స్ కావట్లేదు.. టాలీవుడ్ ఆఫర్స్ నుంచి జాన్వీ ఏం కోరుకుంటుంది.
Janhvi Kapoor: ఆఫర్లు వచ్చినా తెలుగుపై ఆసక్తి చూపని జాన్వీ?
ఇదీ కథ.. జాన్వీకపూర్ తప్పకుండా తెలుగులో నటిస్తుంది కానీ ఆమె ప్రస్తుతం ఏ తెలుగు సినిమాకు సైన్ చేయలేదని ప్రకటించారు బోనీకపూర్. రీసెంట్ గా వలిమై ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ కొచ్చిన బోనీ.. మంచి డైరెక్టర్, స్క్రిప్ట్ దొరికితే శ్రీదేవి కళను జాన్వీ కపూర్ నెరవేరుస్తుందన్నారు. అలాగే తారక్ – కొరటాల కాంబో మూవీలో జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలనూ ఆయన కొట్టిపడేశారు.
Janhvi Kapoor: జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. రౌడీ హీరోతో రెడీ!
గత కొంతకాలం నుంచి జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మహేశ్ బాబు, ఎన్టీఆర్, చరణ్ దగ్గరి నుంచి రీసెంట్ గా విజయ్ దేవరకొండ మూవీ వరకు జాన్వీ పేరు గట్టిగానే వినిపించింది. కానీ అవేమి నిజం కాలేదు. స్క్రిప్ట్ పట్టుకుని మేకర్స్ ఆమె చుట్టూ తిరుగుతున్నా.. ఎందుకో జాన్వీ ఎస్ చెప్పటం లేదు. స్క్రిప్ట్ నచ్చకో, రెమ్యునరేషన్ కుదరకో, శ్రీదేవి కూతురుగా ఫుల్ గ్రాండ్ గా తన ఎంట్రీని కోరుకుంటుందో కానీ ఇప్పటికైతే సౌత్ సినిమాపై జాన్వీ ఇంట్రెస్ట్ కనిపించడం లేదు.
Janhvi Kapoor: అందాల నెరజాణ.. అదరహో అనిపిస్తున్న జాన్వీ!
ధడక్ తో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన జాన్వీ.. అటు థియేటర్స్ లో సినిమాలు.. ఇటు సోషల్ మీడియా గ్లామర్ షోతో ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేస్తూనే ఉంది. 2021లో రూహీతో పలకరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం దోస్తానా2, గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మాహీ, బాంబే గర్ల్, రణ్ భూమి, థక్త్ వంటి ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. నార్త్ లో ఇన్ని సినిమాలను లైన్ లో పెట్టిన జాన్వీ.. సౌత్ నుంచి స్టార్ డైరెక్టర్ ఎవరైనా సూపర్ రోల్ ని ఆఫర్ చేస్తేనే ఇక్కడి వారి ముందుకొచ్చేలా లెక్కలేస్తోంది.
