Ramba Oorvasi Menaka Teaser : అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ వచ్చేసింది.. రంభ ఊర్వశి మేనకలు భూమి మీదకు వస్తే..

మీరు కూడా రంభ ఊర్వశి మేనక టీజర్ చూసేయండి.. (Ramba Oorvasi Menaka Teaser)

  • Updated on- August 11, 2026 / 04:14 PM IST

Ramba Oorvasi Menaka Teaser

Ramba Oorvasi Menaka Teaser : అల్లరి నరేష్, సురభి జంటగా తెరకెక్కుతున్న సినిమా రంభ ఊర్వశి మేనక. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల నిర్మాణంలో చంద్ర మోహన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రంభ ఊర్వశి మేనక సినిమా సెప్టెంబర్ 4న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

నేడు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ తో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా రంభ ఊర్వశి మేనక టీజర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో రంభగా రాశి సింగ్, ఊర్వశిగా విష్ణుప్రియ, మేనకగా ప్రిషా సింగ్ లు, ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. టీజర్ చూస్తుంటే హీరోకి చిన్నప్పుడు ఓ బుక్ దొరుకుతుంది. ఆ బుక్ మీద కరెక్ట్ గా ముగ్గు గీస్తే రంభ ఊర్వశి మేనకలు కిందకు వచ్చి ఏం కావాలన్నా ఇస్తారు. దాంతో ఓ పాతికేళ్ళు ట్రై చేస్తూ, రంభ ఊర్వశి మేనకలకు పూజలు చేస్తూ ఉన్న హీరోకు ఎట్టకేలకు రంభ ఊర్వశి మేనకలు కిందకు దిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అని కామెడీ సినిమాగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

Also See : Shivathmika Rajashekar : సరికొత్త షార్ట్ హెయిర్ స్టైల్ తో శివాత్మిక రాజశేఖర్.. ఫొటోలు..

మీరు కూడా రంభ ఊర్వశి మేనక టీజర్ చూసేయండి..