Rambha Oorvasi Menaka Twitter Review : ‘రంభ ఊర్వశి మేనక’ ట్విట్టర్ రివ్యూ.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడినట్లేనా?
అల్లరి నరేష్ నటించిన చిత్రం రంభ ఊర్వశి మేనక నేడు ప్రేక్షకుల ముందుకు (Rambha Oorvasi Menaka Twitter Review) వచ్చింది
- Thota Vamshi Kumar
- Updated on- September 4, 2026 / 10:50 AM IST
Allari Naresh Rambha oorvasi menaka twitter review
Rambha Oorvasi Menaka Twitter Review : అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేశ్ దండా, నిమ్మకాల ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ కథానాయికలుగా నటించగా వెన్నెల కిషోర్, నరేష్ వీకే కీలక పాత్రలను పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 4) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పలు చోట్ల షోలు పడ్డాయి. ఈ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఫస్టాఫ్ అదిరిపోయిందని అంటున్నారు. నరేష్ కామెడీ బాగుందని చెబుతున్నారు. సెకండాప్ కూడా పర్వాలేదని అంటున్నారు. ఓవరాల్‌గా మూవీ బాగుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Read Also – Rashmika Mandanna : గాయం తరువాత మొదటిసారి బయటకు వస్తున్న రష్మిక.. మరిది కోసం.. ఎప్పుడు, ఎక్కడ?
