Allu Aravind: తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకో.. మృణాల్‌పై అల్లు అరవింద్ ‘పెళ్లి’ బాణం.. తెగ సిగ్గుపడిపోయిన డెకాయిట్ బ్యూటీ
మృణాల్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన అల్లు అరవింద్(Allu Aravind).
- V Santhosh Kumar
- Published On : April 12, 2026 / 02:54 PM IST
allu aravind comments on mrunal thakur marriage
- మృణాల్ కూడా తెలుగు కోడలు కాబోతుందా?
- అల్లు అరవింద్ జోస్యం నిజమవుతుందా?
- డకాయిట్ సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్
Allu Aravind: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ సమక్షంలో జరిగే వేడుకలు ఎప్పుడూ సరదాగా, ఆసక్తికరంగా సాగుతుంటాయి. తాజాగా ‘డకాయిట్’ చిత్ర సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. మృణాల్ త్వరలోనే ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడిపోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మాటలు విన్న మృణాల్ వేదికపైనే ఎంతో సిగ్గుపడుతూ నవ్వడం అక్కడి వారిని ఆకట్టుకుంది.
*త్వరలో పవన్ కళ్యాణ్ ని కలుస్తా.. 45 రోజుల్లో సినిమా తీస్తా.. రెండు సినిమాలకంటే పెద్ద హిట్ ఇస్తా
గతంలో లావణ్య త్రిపాఠి విషయంలో కూడా అల్లు అరవింద్(Allu Aravind) ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఒక ఆడియో ఫంక్షన్‌లో ఆమెను తెలుగు కోడలు కావాలని ఆయన కోరగా, అనూహ్యంగా ఆమె మెగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకుని ఆ మాటను నిజం చేసింది. ఇప్పుడు మృణాల్ విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందా అని అరవింద్ చమత్కరించారు. “అప్పుడు లావణ్యను అన్నాను, ఆమె వరుణ్‌ను చేసుకుంది.. ఇప్పుడు మృణాల్‌ను అంటున్నాను, మరి ఈమె ఎవరిని చేసుకుంటుందో చూడాలి” అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.
అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మృణాల్ పెళ్లిపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. సీతారామం, హాయ్ నాన్న వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ మరాఠీ భామ, నిజంగానే తెలుగు ఇంటి కోడలు అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అరవింద్ నోటి వెంట వచ్చిన మాటలు అప్పట్లో లావణ్య విషయంలో నిజమైనట్లే, మృణాల్ విషయంలో కూడా నిజమవుతాయేమోనని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
