Allu Aravind : చిరంజీవిపై కామెంట్స్ చేస్తున్న వారిపై అల్లు అరవింద్ ఫైర్.. అసలు ఏమైంది..?
చిరంజీవిపై కామెంట్స్ చేస్తూ మెగా కాంట్రవర్సీ సృష్టిస్తున్న వారిపై అల్లు అరవింద్ ఫైర్ అయ్యారు. అలాగే కన్నడ పరిశ్రమ పై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇంతకీ అసలు ఏమైంది..?
- gum 95921
- Published On : December 4, 2023 / 03:29 PM IST
Allu Aravind Sensational Comments On media who made controversy on chiranjeevi
Allu Aravind : అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చినంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ వాటన్నిటికీ ఏదొక విషయంతో కౌంటర్ ఇస్తూ వస్తుంటారు మెగా-అల్లు కుటుంబసభ్యులు. తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ విషయంలో ఒక వివాదం తలెత్తింది. ఆ వివాదంలోకి చిరంజీవిని లాగి మెగా కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇక ఈ విషయం పైనే అల్లు అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన బావ చిరంజీవికి సపోర్ట్ గా మాట్లాడుతూ.. విమర్శలు చేసే వారిపై ఫైర్ అయ్యారు అసలు ఏమైంది..?
టాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ జర్నలిస్ట్.. గత కొన్నేళ్ల నుంచి సినిమా అవార్డులు అందిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఈ ఏడాది అవార్డుల వేడుకను గోవాలో నిర్వహించారు. అయితే అక్కడ ఈవెంట్ నిర్వహించడంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వాటి వల్ల కన్నడ సినిమా ఇండస్ట్రీ వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం పై కన్నడ సినీ పరిశ్రమలోని పలువురు టాలీవుడ్ ని నిందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలోని మనుషులు ఇంతే అంటూ వైరల్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ విషయాన్ని పలు మీడియా పేపర్స్ అండ్ వెబ్ సైట్స్ చిరంజీవికి లింక్ చేస్తూ వార్తలు రాస్తున్నారు. ఆ అవార్డులు నిర్వహించిన జర్నలిస్ట్ చిరంజీవి పిఆర్ఓ అని చెబుతూ మెగా కాంట్రవర్సీ సృష్టిస్తున్నారు. ఇక విషయం గురించే అల్లు అరవింద్ ఆగ్రహం వ్యాఖ్యాతం చేశారు. “ఆ జర్నలిస్ట్ ఎప్పుడైనా తన కుటుంబంలోని సబ్యులకు పిఆర్ఓ అని చెప్పాడా? మా ఫ్యామిలీలోని వ్యక్తితో ఫోటో దిగి, కొన్ని సందర్భాల్లో పక్కన నిలబడి మాట్లాడనంత మాత్రానా అతన మా ఫ్యామిలీకి చెందిన పిఆర్ఓ అయ్యిపోతాడా?” అంటూ ప్రశ్నించారు.
అలాగే కన్నడ పరిశ్రమలోని వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలను కూడా ఖండించారు. అవార్డులు ఇవ్వడం అనేది ఆ జర్నలిస్ట్ వ్యక్తిగతం. దానిని ఒక ఇండస్ట్రీకి లేదా వ్యక్తికీ ఆపాదించడం కరెక్ట్ కాదు అంటూ కన్నడ పరిశ్రమ పై అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
