Allu Aravind vs yash mother : అల్లు అరవింద్ వర్సెస్ యశ్ మదర్ వివాదం.. అసలు విషయం ఇదేనా?
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, కన్నడ స్టార్ హీరో యశ్ తల్లికి సంబంధించిన ఓ అంశం ప్రస్తుతం (Allu Aravind vs yash mother) సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది
- Thota Vamshi Kumar
- Published on- September 4, 2026 / 02:45 PM IST
Allu Aravind vs yash mother Is this the real issue
Allu Aravind vs yash mother : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, కన్నడ స్టార్ హీరో యశ్ తల్లికి సంబంధించిన ఓ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదానికి కారణమైన వీడియో తాజాగా జరిగినది కాకుండా.. 2023లో ‘కోటబొమ్మాళి PS’ సినిమా కార్యక్రమంలో మాట్లాడినది కావడం గమనార్హం.
ఆ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. కేజీఎఫ్‌కు ముందు, కేజీఎఫ్ తరువాత యశ్ కెరీర్‌లో వచ్చిన భారీ మార్పును ప్రస్తావించారు. ఒక సినిమా విజయం, ఒక్క శుక్రవారం కూడా నటుడి కెరీర్‌ను పూర్తిగా మార్చగలదనే విషయాన్ని వివరించే క్రమంలోనే ఆయన యశ్‌ను ఊదాహరణగా తీసుకున్నారు.
Priyanka Jain : కృష్ణాష్టమి స్పెషల్.. రాధగా సీరియల్ నటి ప్రియాంక జైన్.. ఏఐ ఫోటోలు..
అయితే.. ఆ పాత వీడియోలోని కొన్ని భాగాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొత్త వివాదానికి తెరలేచింది. అల్లు అరవింద్ వ్యాఖ్యల్లో యశ్‌ను విమర్శించే ఉద్దేశం లేదని, ఆయన యశ్ ఎదుగుదలను ఉదాహరణగా చూపిస్తూ మాట్లాడారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించడం కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు మూడు సంవత్సరాల క్రితం జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఎందుకు వివాదంగా మారిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సినీ వర్గాల అభిప్రాయం ప్రకారం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని సెకన్ల వీడియో క్లిప్పులను మాత్రమే చూసి నిర్ణయానికి రావడం కంటే, పూర్తి వీడియోను చూసి అసలు సందర్భాన్ని అర్థం చేసుకోవడం అవసరం. అల్లు అరవింద్ చెప్పిన అంశం కూడా ఒక సినిమా విజయం ద్వారా నటుడి కెరీర్, మార్కెట్, స్టార్‌డమ్ ఎంత వేగంగా మారిపోవచ్చనే విషయానికి సంబంధించినది మాత్రమే.
ఇదే విషయాన్ని గతంలో యశ్ కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించినట్లు అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఒక విజయవంతమైన సినిమా నటుడి జీవితాన్ని పూర్తిగా మార్చగలదనే అంశమే ఇద్దరి వ్యాఖ్యల్లో ప్రధానంగా కనిపిస్తోందని అంటున్నారు.
మొత్తానికి 2023లో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన 2026లో మరో సందర్భంలో వివాదంగా మార్చడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. అప్పటి పూర్తి వీడియోను యశ్ తల్లి చూసి ఉంటే.. అల్లు అరవింద్ వ్యాఖ్యల ఉద్దేశ్యం అర్థం అయ్యేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
