Pushpa 2 : పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు.. గుడ్ న్యూస్ చెప్పిన సుకుమార్!
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప 2 (Pushpa) కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరికీ సుకుమార్ ఒక గుడ్ న్యూస్ చెప్పాడు.
- gum 95921
- Published On : March 31, 2023 / 06:38 PM IST
Allu Arjun and Sukumar Pushpa 2 updates are loading
Pushpa 2 : అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కలయికలో వచ్చిన మూడో సినిమా పుష్ప (Pushpa). రా అండ్ రస్టిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం 2021 లో రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఒక రీజినల్ సినిమాగా తెరకెక్కిన పుష్ప పాన్ ఇండియా సక్సెస్ ని అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజం, డైలాగ్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫేమస్ అయ్యాయి. దీంతో తగ్గేదేలే అంటూ రష్యాలో కూడా రిలీజ్ అయ్యి దుమ్ము దులిపేసింది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Allu Arjun: ఇండియాస్ పాపులర్ టాక్ షోలో సందడి చేయనున్న సౌత్ పాన్ ఇండియా స్టార్స్..?
పుష్ప ది రైజ్ అంటూ వచ్చిన మొదటి భాగం సూపర్ హిట్టు అవ్వడంతో సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి అయినా, ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. ఇక ఇప్పుడు వారిని ఆనందపరుస్తూ దర్శకుడు సుకుమార్ ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. అప్డేట్స్ వస్తున్నాయి అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజున మూవీ నుంచి గ్లింప్స్ లేదా టీజర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Allu Arjun: ‘దేశముదురు’ రీ-రిలీజ్‌తో సందడి చేయబోతున్న బన్నీ.. ఎప్పుడంటే?
మొదటి పార్ట్ తో ఎన్నో సంచలనాలు సృష్టించిన పుష్ప రాజ్.. సెకండ్ పార్ట్ తో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రెండో భాగం కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కి దేవిశ్రీ ఇచ్చిన ఊ అంటావా ఊఊ అంటావా సాంగ్ ఇండియా వైడ్ ఒక ఊపు ఊపేసింది. మరి ఈ సెకండ్ పార్ట్ లో ఎటువంటి ఐటమ్ నెంబర్ తో వస్తాడో చూడాలి.
Updates rolling soon! #PushpaTheRule ❤️?? pic.twitter.com/I4Zn1yxwmB
— Pushpa (@PushpaMovie) March 31, 2023
