×
Ad

Allu Arjun – Dheeran : హీరోగా అల్లు అర్జున్ చిన్నప్పటి ఫ్రెండ్.. నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అంటూ బన్నీ స్పెషల్ ట్వీట్..

అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ గా ఉన్న ధీరన్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

  • Published On : August 3, 2024 / 06:44 PM IST

Allu Arjun Childhood Friend Dheeran Become Hero Special Tweet by Bunny

Allu Arjun – Dheeran : అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ గా ఉన్న ధీరన్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళ్ సినీ పరిశ్రమలో ధీరన్ హీరోగా పరిచయమవుతూ ‘సాలా’ అనే ఓ సినిమాతో వస్తున్నాడు. తాజాగా ఈ సాలా సినిమా ట్రైలర్ ని అల్లు అర్జున్ లాంచ్ చేసాడు. అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో సాలా ట్రైలర్ ని షేర్ చేస్తూ.. నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ధీరన్ కు ఆల్ ది బెస్ట్. నా విషెస్, సపోర్ట్ ఎప్పుడూ నీకు ఉంటాయి. సాలా ట్రైలర్ నేను లాంచ్ చేసినందుకు ఆనందంగా ఉంది అని పోస్ట్ చేసారు.

అల్లు అర్జున్ ట్వీట్ ని ధీరన్ రీ షేర్ చేస్తూ.. 26 ఏళ్ళ క్లోజ్ ఫ్రెండ్షిప్. నువ్వు ఎప్పుడూ నాకు పిల్లర్ లా సపోర్ట్ ఇస్తావు. నా డెబ్యూట్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్యూ. నీ ప్రేమకు, సపోర్ట్ కి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు బ్రదర్ అని ట్వీట్ చేసాడు. ఇక ఈ సాలా సినిమా కేవలం తమిళ్ లోనే తెరకెక్కుతుంది. ఈ సినిమాని మన తెలుగు నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ సాలా ట్రైలర్ చూస్తుంటే.. ఓ బార్ కోసం గొడవలు జరుగుతున్నట్టు చూపించారు. మీరు కూడా ఈ సాలా తమిళ్ ట్రైలర్ చూసేయండి..