Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్.. కీలక వ్యాఖ్యలు చేసిన బన్నీ..

ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ లో మాట్లాడుతూ ట్రోల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Allu Arjun)

  • Published on- July 28, 2026 / 05:00 PM IST

Allu Arjun

Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. షూటింగ్ గ్యాప్ లో తాజాగా నేడు అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ని మీట్ అయ్యారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్ నేడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ హాజరయి ఫ్యాన్స్ తో మాట్లాడి, పలువురికి ఫోటోలు ఇచ్చారు.

ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ లో మాట్లాడుతూ ట్రోల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also See : Sri Gouri Priya : ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్.. చీరకట్టులో మెరిపించిన శ్రీ గౌరీ ప్రియ..

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నా అభిమానులకు మాత్రమే కాదు నన్ను ద్వేషించే వాళ్లకు కూడా ఓ విషయం ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్నాను. ఒకరిపై విమర్శలు చేయడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. మనకు నచ్చని వాళ్ల కోసం మన డబ్బును ఖర్చు పెడతామా? లేదు కదా. అలాగే మనకు నచ్చని వాళ్ల కోసం మన సమయం, డబ్బు, శక్తి ఎందుకు ఖర్చు చేయాలి. సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్‌పై స్పందించడం కంటే ఆ టైంని మీ ఎదుగుదల కోసం ఉపయోగించండి. ఆ సమయంలో మీకు నచ్చిన పని చేయండి. లేకపోతే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చోండి పర్లేదు కనీసం ఆ సమయాన్ని అయినా మీరు ఆస్వాదిస్తారు కదా. మీకు నచ్చని వాళ్ళను ట్రోల్ చేయకండి, వదిలేయండి. ఎవరినీ ట్రోల్స్ చేయకండి. టైమ్‌, ఎనర్జీ ఏదైనా ప్రతి మనిషికి ఒక రోజులో వంద శాతం ఉంటే దాన్ని మీరు దేనికి వాడతారు అనేదే ముఖ్యం అని అన్నారు.