Allu Arjun : అల్లు అర్జున్ సినిమా సీన్స్ రీ క్రియేట్ చేస్తూ.. ‘మేడం సర్ మేడం అంతే’.. బన్నీ ఫ్యాన్స్ కచ్చితంగా చూడాల్సిన సాంగ్..

'మేడం సార్ మేడం అంతే' అనే అలవైకుంఠపురంలో సినిమా ఫేమస్ డైలాగ్ లైన్ తో ఈ పాట సాగుతుంది.

Allu Arjun : రావు రమేష్, ఇంద్రజ మెయిన్ లీడ్స్ లో ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాణంలో లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదే సినిమాలో అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా నటిస్తున్నారు. రావు రమేష్ తనయుడి పాత్రలో అంకిత్, తన లవర్ పాత్రలో రమ్య ఇందులో నటిస్తుండగా తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాలో ఈ ఇద్దరిపై వచ్చే సాంగ్ ని విడుదల చేశారు.

‘మేడం సార్ మేడం అంతే’ అనే అలవైకుంఠపురంలో సినిమా ఫేమస్ డైలాగ్ లైన్ తో ఈ పాట సాగుతుంది. అయితే ఈ సినిమాలో అంకిత్ అల్లు అర్జున్ అభిమానిగా కనిపిస్తుండటంతో పాటని చాలా కొత్తగా డిజైన్ చేశారు. అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్ ఎంట్రీ సన్నివేశాలని తీసుకొని ఇందులో రీ క్రియేట్ చేశారు. హీరో అల్లు అర్జున్ గెటప్స్ వేస్తే, హీరోయిన్ అల్లుఅర్జున్ సినిమాల్లో హీరోయిన్స్ గెటప్స్ వేసింది. ఇంకేముంది ఈ సాంగ్ వైరల్ గా మారింది. బన్నీ ఫ్యాన్స్ ఈ పాట చూసి ఫిదా అయి మరింత వైరల్ చేస్తున్నారు. మీరు కూడా ఈ సాంగ్ చూసేయండి మరి.

Also Read : Robinhood : నితిన్ దొంగతనం చేసేది అప్పుడే.. ‘రాబిన్ హుడ్’ రిలీజ్ డేట్ అనౌన్స్..

ఇక ఈ ‘మేడం సార్ మేడం అంతే’ పాటని భాస్కరభట్ల రాయగా కళ్యాణ్ నాయక్ సంగీత దర్శకత్వంలో సిద్ శ్రీరామ్ పాడాడు. ఇక ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి రావు రమేష్ గారి లుక్, అంతకు ముందు రిలీజ్ చేసిన సాంగ్ కి మంచి స్పందన వచ్చింది. త్వరలో మరిన్ని పాటలు, టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేస్తాం. ఆల్రెడీ షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం అని తెలిపారు. ప్రస్తుతానికి ఈ మేడం సార్ మేడం అంతే సాంగ్ మాత్రం వైరల్ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు