Allu Arjun-Dil Raju: మాటిచ్చిన అల్లు అర్జున్.. దిల్‌రాజుతో క్రేజీ ప్రాజెక్టు.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Allu Arjun-Dil Raju Movie Update: అట్లీ, లోకేష్ కనగరాజ్ సినిమాల తరువాత నిర్మాత దిల్ రాజుతో భారీ సినిమా చేయనున్న అల్లు అర్జున్(Allu Arjun).
- V Santhosh Kumar
- Updated on- April 17, 2026 / 12:51 PM IST
allu arjun planning a huge movie with producer dil raju
- మళ్లీ కలవబోతున్న ‘ఆర్య’ కాంబో
- మాట ఇచ్చిన అల్లు అర్జున్
- బన్నీ కోసం దిల్‌రాజు మాస్టర్ ప్లాన్
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. వీరి కాంబోలో ఇప్పటికే వచ్చిన ఆర్య, పరుగు, దువ్వాడ జగన్నాధం లాంటి సినిమాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం వీరిద్దరి కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కేనుందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 2027-28 టార్గెట్ గా దిల్‌రాజు ఒక బలమైన లైనప్‌ను సిద్ధం చేస్తున్నారు.
*రుక్మిణి వసంత్ ఎందుకలా చేసింది.. ఎన్టీఆర్ కోసం ధనుష్ కు నో చెప్పింది
ప్రస్తుతం ఆయన ఎల్లమ్మ, రౌడీ జనార్దన్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, బన్నీ(Allu Arjun)తో సినిమా చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అల్లు అర్జున్ ఇప్పటికే దిల్‌రాజుకు ఒక సినిమా చేస్తానని మాట కూడా ఇచ్చారట. అందుకోసం ఒక స్టార్ డైరెక్టర్ ను సెట్ చేసే పనిలో పడ్డారట దిల్ రాజు. గతంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని భావించినా, అది కుదరలేదు. దీంతో అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, పాన్ ఇండియా స్థాయిలో మెప్పించగల ఒక స్టార్ డైరెక్టర్ కోసం దిల్‌రాజు ట్రై చేస్తున్నాడట.
మరోపక్క అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం తన క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ఆయన కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయ్యాక ఈ కొత్త సినిమా పట్టాలెక్కనుంది. ఈ భారీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన 2027లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దిల్‌రాజు నిర్మాణ విలువలు, అల్లు అర్జున్ స్టార్‌డమ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
