Raaka: అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’.. అసలు ‘రాకా’ అంటే అర్థం ఏంటి? ఆ టైటిల్ ఎందుకు పెట్టారంటే?

అల్లు అర్జున్ 'రాకా(Raaka)' సినిమాపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Allu Arjun Raaka movie title meaning

  • అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’
  • సరికొత్త లుక్ లో బన్నీ
  • అసలు రాకా అంటే అర్థం ఏంటి అంటూ సెర్చింగ్

Raaka: తాను చేసే ప్రతీ సినిమాలో ఎదో ఒక కొత్తదనం ఉండేలా కోరుకునే హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు ఈ హీరో ‘రాకా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ స్టార్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. దాంతో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కానీ, కొంతమంది మాత్రం అసలు ‘రాకా’ అంటే అర్థం ఏంటి అంటూ నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టారు.

*అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన లోకేష్.. బన్నీ బర్త్ డే రోజున ఇంట్రెస్టింగ్ పోస్ట్

అయితే, ‘రాకా(Raaka)’ అనే పేరును ‘రాక్షసుడు’ అనే పదం నుండి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అందులో ఒక పాత్ర పూర్తి నెగెటివ్ షేడ్స్ కలిగి ఉండటమే కాకుండా, సగం మనిషి, సగం మృగ లక్షణాలతో కూడిన ఒక వింత జీవిగా కనిపిస్తుందని సమాచారం. ఈ క్రూరమైన పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా, రెండవ పాత్ర మాత్రం అల్లు అర్జున్ మార్క్ స్టైలిష్ లుక్‌లో ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉండబోతోంది. అందుకే, ఈ సినిమాకు రాకా అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

బన్నీ అభిమానులు ఈ ప్రయోగాత్మక పాత్రపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అల్లు అర్జున్ తన నటనతో ఈ వింత పాత్రను ఏ స్థాయిలో పండిస్తారో అని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ విభిన్నమైన రోల్స్ బన్నీ కెరీర్‌లోనే ఒక కొత్త మైలురాయిగా నిలుస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.