×
Ad

Allu Arjun : పుష్ప అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్.. షూటింగ్ ఎక్కడ? ఏ సీన్?

నవంబర్ 11న మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా రావడంతో చాలా మంది ఫ్యాన్స్ కూడా వచ్చారు. ఫ్యాన్స్ పుష్ప 2 సినిమా గురించి అడగడంతో బన్నీ మంగళవారం సినిమా గురించి మాట్లాడిన తర్వాత పుష్ప అప్డేట్ ఇచ్చారు.

  • Published On : November 12, 2023 / 08:18 AM IST

Allu Arjun reveal Pushpa 2 Movie Update in Mangalavaaram Movie Pre Release Event

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2(Pushpa 2) సినిమా గురించి అంతా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం ఆగస్టు 15 ఈ సినిమా రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా అల్లు అర్జున్ మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన ‘మంగళవారం’ సినిమా నవంబర్ 17న రిలీజ్ కానుంది.

తాజాగా నిన్న నవంబర్ 11న మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా రావడంతో చాలా మంది ఫ్యాన్స్ కూడా వచ్చారు. ఫ్యాన్స్ పుష్ప 2 సినిమా గురించి అడగడంతో బన్నీ మంగళవారం సినిమా గురించి మాట్లాడిన తర్వాత పుష్ప అప్డేట్ ఇచ్చారు.

Also Read : Sitara Ghattamaneni : దీపావళికి ముగ్గులు వేస్తున్న సితార పాప.. క్యూట్ గా దివాళి స్పెషల్ ఫోటోలు..

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను పుష్ప షూట్ నుంచే వచ్చాను. రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. లాస్ట్ టైం రిలీజ్ చేసిన జాతర పోస్టర్ చూసారు కదా, ఆ జాతర షూట్ జరుగుతుంది. అందుకే చేతులకు ఇంకా నెయిల్ పాలిష్, పసుపు ఉన్నాయి. మీరు ఊహించిన దానికన్నా మించి ఉంటుంది పుష్ప 2. ప్రస్తుతానికి ఇదే అప్డేట్. సినిమా రిలీజయ్యాక మీరే చూస్తారు అని చెప్పారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.