Allu Ayaan : చిన్నవయసులోనే బన్నీ తనయుడు మంచిపని.. అల్లు అయాన్ పై ప్రశంసలు..
తాజాగా అయాన్ ఓ మంచిపని చేసి వైరల్ అవుతున్నాడు.(Allu Ayaan)
- Saketh U
- Updated on- May 14, 2026 / 10:48 AM IST
Allu Ayaan
Allu Ayaan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయాన్ ఎప్పుడు కనపడినా సరదాగా ఏదో ఒక పని చేసి, ఏదో మాట్లాడి అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వైరల్ అవుతాడు. అల్లు అయాన్ ని మోడల్ అయాన్ అని ఫ్యాన్స్ సరదాగా పిలుచుకుంటారు. తాజాగా అయాన్ ఓ మంచిపని చేసి వైరల్ అవుతున్నాడు.
Also Read : Vijay-Trisha Movie: విజయ్ పర్మిషన్ ఇచ్చినా.. త్రిష సినిమాకు తప్పని అడ్డంకులు.. ఒక్క షో కూడా పడకుండానే..
అల్లు అయాన్ ఓ గుర్రాన్ని దత్తత తీసుకున్నాడు. రేస్ 2 ఫౌండేషన్ అనే సంస్థ నుంచి అల్లు అయాన్ ఓ గుర్రాన్ని దత్తత తీసుకున్నాడు. ఆ సంస్థలో ఉండే సిద్దార్థ్ అనే గుర్రాన్ని అయాన్ దత్తత తీసుకున్నాడు. ఆ సంస్థ.. గుర్రంతో పాటు సిద్దార్థ్ అనే గుర్రం పేరు, దాని డోనర్ అల్లు అయాన్ అని ఉన్న బోర్డులను చూపిస్తూ ఓ ఫోటోని షేర్ చేసింది. దీంతో అయాన్ చేసిన మంచిపనిని, అతని మంచి మనుసుని నెటిజన్లు, ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా ఈ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
