Allu Ayaan : మార్షల్ ఆర్ట్స్‌లో అదరగొడుతున్న అల్లు అయాన్.. వీడియో వైరల్..
సోషల్ మీడియాలో అల్లు అయాన్ ని మోడల్ అయాన్ అని ఫ్యాన్స్ కూడా సరదాగా పిలుచుకుంటారు. (Allu Ayaan)
- Saketh U
- Published On : March 11, 2026 / 11:07 AM IST
Allu Ayaan
Allu Ayaan : అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అని తెలిసిందే. సోషల్ మీడియాలో అయాన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అయాన్ కనిపించాడు అంటే కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సోషల్ మీడియాలో అల్లు అయాన్ ని మోడల్ అయాన్ అని ఫ్యాన్స్ కూడా సరదాగా పిలుచుకుంటారు.
అల్లు శిరీష్ కూడా అయాన్ కి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు. అల్లు స్నేహారెడ్డి రెగ్యులర్ గా అయాన్, అర్హ లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా అల్లు స్నేహారెడ్డి ఫిబ్రవరి మెమరీస్ అంటూ పలు ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది.
Also Read : Baladitya : రోజా అక్కతో బాగా ఆడుకునేవాడ్ని.. రోజా గురించి బాలాదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇందులో ఓ వీడియోలో అల్లు అయాన్ తన మార్షల్ ఆర్ట్స్ విద్యని ప్రదర్శిస్తున్నాడు. అల్లు అయాన్ చేత్తో టైల్స్ ని పగలకొట్టినట్టు ఈ వీడియోలో ఉంది. పక్కనే అయాన్ మాస్టర్ కూడా ఉన్నాడు. దీంతో అయాన్ ఇప్పట్నుంచే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కామెడీగా కనిపించినా, అయాన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా సీరియస్ గానే కష్టపడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియోతో అల్లు అయాన్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.
Iconic star #AlluArjun’s son #AlluAyaan training in martial arts pic.twitter.com/9KMoYlQWQS
— greatandhra (@greatandhranews) March 11, 2026
Also See : Jr NTR Mother : బిఆర్ఎస్ నేతను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..
