×
Ad

Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. బాక్సాఫీస్ రూలింగ్ అప్పటి నుంచే..

పుష్ప 2 రిలీజ్ కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు..

  • Published On : September 11, 2023 / 04:07 PM IST

Allu Arjun Sukumar Pushpa 2 release date announce

Pushpa 2 : సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప 2 కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి ఏడాది పైనే అవుతున్నా.. సెకండ్ పార్ట్ రిలీజ్ పై ఇప్పటివరకు మూవీ నుంచి ఎటువంటి రెస్పాండ్ రాలేదు. తాజాగా నేడు రిలీజ్ డేట్ పై అనౌన్స్‌మెంట్ చేసి ఆడియన్స్ ని సర్‌ప్రైజ్ చేశారు.

Bigg Boss 7 : వాడీ వేడీగా నామినేషన్స్‌ ప్ర‌క్రియ‌.. నేను ఎవ‌రి మాట విన‌ను అన్న శివాజీ.. అంత‌లేద‌మ్మా

బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప గాడి రూల్.. వచ్చే ఏడాది ఆగష్టు 15 నుంచి మొదలు కాబోతుంది. ఆగష్టు 15 నుంచి 19 వరకు ఐదు రోజులు లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది. ఇక రిలీజ్ డేట్ తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఫస్ట్ పార్ట్ తోనే ఓ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప.. ఇప్పుడు భారీ అంచనాలతో వస్తున్న ఈ సెకండ్ పార్ట్ తో ఎటువంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. రష్మిక మందన్న (Rashmika Mandanna) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) విలన్ గా కనిపించబోతున్నాడు.

Peddha Kapu 1 : రా అండ్ రస్టిక్‌గా పెదకాపు-1 ట్రైలర్.. శ్రీకాంత్ అడ్డాల అదరగొట్టేశాడు..

అలాగే సునీల్, అనసూయ, ధనంజయ్, జగదీష్ తదితరులు నెగటివ్ షేడ్ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఫస్ట్ పార్ట్ కి తన మ్యూజిక్ తో ఎంతో ఫేమ్ ని తీసుకువచ్చిన దేవిశ్రీ ప్రసాద్.. సెకండ్ పార్ట్ కి ఎలాంటి మ్యూజిక్ అందించబోతున్నాడో అని అందరిలో ఆసక్తి నెలకుంది.