పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు నాడే కాంట్రవర్సీలకు పుల్‌స్టాప్ పడబోతోందా?

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య వార్ జరుగుతున్నట్లు గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి శుభం కార్డు వేసేలా ఇరుకుటుంబాలు అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు నాడే కాంట్రవర్సీలకు పుల్‌స్టాప్ పడబోతోందా?

Allu Arjun and Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మధ్య రాజీ కుదురుతోందా? ఏపీ ఎన్నికల నుంచి ఇరు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని అల్లు ఫ్యామిలీ చొరవ తీసుకుంటోందా? మెగా ఫ్యామిలీలో భాగమైన తమ మధ్య విభేదాలేవీ లేవని చాటిచెప్పేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయా? పవర్‌స్టార్ పుట్టిన రోజు నాడే కాంట్రవర్సీలకు పుల్‌స్టాప్ పడబోతోందా? ఏది నిజం!

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య వార్ జరుగుతున్నట్లు గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి శుభం కార్డు వేసేలా ఇరుకుటుంబాలు అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏపీ ఎన్నికల సందర్భంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయడంతో రెండు ఫ్యామిలీల మధ్య వార్ మొదలైనట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంతవరకు ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యానించకపోయినప్పటికీ.. ఇటీవల పుష్ప సినిమా కథాంశాన్నే తప్పు పడుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు చేయడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి.

ఇక పవన్‌కు కౌంటర్ అన్నట్లు.. సుబ్రమణ్యం సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇటు టాలీవుడ్‌లోనూ అటు పొలిటికల్ స్క్రీన్‌పైనా హీట్ పుట్టించాయి. ఇక ఈ వివాదం పూర్తిగా రాజకీయ రంగు పులుముకునేలా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన విమర్శలతో మరింత వేడెక్కింది. మెగా అభిమానులు తప్ప అల్లు అభిమానులు అంటూ ఎవరూ ఉండరని ఎమ్మెల్యే బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలతో ఇరువైపులా యుద్ధం తారాస్థాయికి చేరుతున్నట్లు కనిపించింది. ఐతే రెండు కుటుంబాల మధ్య అలాంటి ఉద్రిక్తతలు ఏవీ లేవని.. ఈ ప్రచారానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని అల్లు ఫ్యామిలీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Also Read: అల్లు అర్జున్ కామెడీ యాక్టర్‌.. హీరో కాదు‌: విరుచుకుపడ్డ జనసేన పార్టీ నాయకులు

ఈ పరిస్థితుల్లో వచ్చేనెల 2న పవర్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ పిఠాపురం వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. డిప్యూటీ సీఎంగా తొలి పుట్టిన రోజు వేడుకను తన సొంత నియోజకవర్గంలో జరుపుకోవాలని పవన్ ఆలోచిస్తున్నారట. అభిమానులు సైతం పిఠాపురంలో పవర్‌స్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. పవన్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంటుందని చెబుతున్నారు. పనిలోపనిగా అల్లు కుటుంబం కూడా ఈ ఈవెంట్‌లో పవన్‌కు విషెస్ చెప్పి.. నంద్యాలలో మొదలైన వార్‌కు ఎండ్‌కార్డ్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో ఎంత నిజముందోగానీ, అభిమానులు మాత్రం ఇరుకుటుంబాలు కలవాలనే కోరుకుంటున్నారు.